రూపురేఖలు మారాయి | Sakshi
Sakshi News home page

రూపురేఖలు మారాయి

Published Wed, Dec 20 2023 1:30 AM

- - Sakshi

నాడు–నేడు వల్ల మా పాఠశాల రూపురేఖలే మారిపోయాయి. గతంలో అరకొర సౌకర్యాలే ఉండటం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడేవారు. సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి నాడు–నేడు కార్యక్రమాన్ని చేపట్టడంతో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు కార్పొరేట్‌ పాఠశాలల తరహాలో సౌకర్యాలు సమకూరాయి. ముఖ్యంగా ఇంటరాక్టీవ్‌ ప్లాట్‌ (ఐఎఫ్‌పీ) విధానంలో బోధనలు చేస్తున్నాం. ఈవిధానం వల్ల విద్యార్థులు సులువుగా పాఠ్యాంశాలను అర్దం చేసుకోగలుగుతున్నారు. ఈకారణంగా విద్యార్థులు బట్టిపట్టే విధానానికి స్వస్తిపలికారు. ఇంటరాక్టీవ్‌ ప్లాట్‌లో బోధనలు చేస్తున్న కారణంగా పరీక్షల్లో కూడా విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు.

– మొలక ఓబులేసు, ఉపాధ్యాయుడు, మన్నూరు జెడ్పీ హైస్కూల్‌, రాజంపేట

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు మంజూరయ్యాయి

మా గ్రామ వలంటీర్‌ వచ్చి నాకు సంబంధించిన ఆధార్‌కార్డు, రేషన్‌ కార్డు తీసుకెళ్లారు. వారం రోజులుకు మా గ్రామంలో జరిగిన జగనన్న సురక్ష కార్యక్రమంలో నాకు నాయకులు, కుల, ఆధాయ ధృవీకరణ పత్రాలను ఉచితంగా అందజేశారు. ఈ ధృవ పత్రాల కోసం గతంలో మా పిల్లలను కాలేజీలో చేర్పించేందుకు కుల, ఆదాయ సరిఫికెట్ల కోసం తహసీల్దారు కార్యాలయం చుట్టూ తిరిగాను. మా వలంటీర్‌ వచ్చి నాకు శ్రమ లేకుండానే దృవీకరణ పత్రాలను చేయించాడు. చాలా సంతోషంగా ఉంది.

– వంతాటిపల్లి ఆయ్యవారయ్య,

ఎగువపేట, సిద్దవటం.

సొంతింటి కల సాకారం

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో మా సొంతింటి కల సాకారమైంది. నా యకుల ప్రమేయం లేకుండానే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వలంటీర్ల వ్యవస్థ ద్వారా మా సొంతింటి కల నెరవేరింది. ప్రభుత్వం మంజూరు చేసిన పక్కా గృహాలలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటిని నిర్మించుకుని సంతోషంగా ఉన్నాం.

– పి.శివనారాయణమ్మ,

లబ్ధిదారురాలు, లింగాల

1/3

2/3

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement