ఇల ‘వైకుంఠం’ .. భక్తజన సందోహం | Sakshi
Sakshi News home page

ఇల ‘వైకుంఠం’ .. భక్తజన సందోహం

Published Sun, Dec 24 2023 1:20 AM

- - Sakshi

వైకుంఠ ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఈ రోజు ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును సేవించుకునేందుకు ఉత్తర ద్వారం దగ్గర వేచి ఉంటారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే భక్తులు తాము కూడా స్వామిని దర్శించుకోవాలనే కోరికతో శనివారం తెల్లవారుజాము నుంచే వైష్ణవాలయాలకు భారీగా చేరుకున్నారు. ఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లాలో ముఖ్యంగా ఒంటిమిట్ట, దేవుని కడప, పుష్పగిరి, నందలూరు సౌమ్యనాథాలయం భక్తజన సంద్రంగా మారాయి. వారు వైకుంఠం ద్వారం ద్వారా స్వామిని కనులారా చూసి తరించారు.

– సాక్షి, నెట్‌వర్క్‌

ఒంటిమిట్ట కోదండరామాలయంలో స్వామి దర్శనం కోసం ఉత్తర ద్వారంలో భారీగా భక్తజనం
1/3

ఒంటిమిట్ట కోదండరామాలయంలో స్వామి దర్శనం కోసం ఉత్తర ద్వారంలో భారీగా భక్తజనం

2/3

3/3

Advertisement
Advertisement