ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేయాలి | Sakshi
Sakshi News home page

ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేయాలి

Published Tue, Dec 26 2023 12:52 AM

మాట్లాడుతున్న పద్మశాలీ ఉద్యోగ సంక్షేమ
 సంఘం జిల్లా అధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు - Sakshi

కడప ఎడ్యుకేషన్‌ : పద్మశాలీ ఉద్యోగుల సంక్షేమ కోసం సంఘం కృషి చేస్తోందని పద్మశాలీయ ఉద్యోగ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం కడప మద్రాసురోడ్డు చిన్నచౌక్‌ పద్మశాలిభవన్‌లో పద్మశాలీ ఉద్యోగ సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందరూ సమాజంలో సేవలు అందిస్తూ సంఘం సంక్షేమ కోసం కృషి చేయాలన్నారు. సంఘ గౌరవాధ్యక్షుడు, ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపాల్‌ గాసుల రవీంద్రనాఽథ్‌ మాట్లాడుతూ సంఘం ప్రతి ఉద్యోగికి వృత్తి రీత్యా ఎదురయ్యే సమస్యలలో తోడుగా ఉంటుందన్నారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సోము జ్ఞానశంకర్‌ పెన్షనర్లకు సంబంధించిన పలు అనుమానాలను నివృత్తి చేశారు. సెక్రటరీ చుప్పల విజయ్‌కుమార్‌, మానవత సేవాసమితి నాయకులు రాటాల గోపీ, అవ్వారు రమేష్‌ మాట్లాడారు. అనంతరం పద్మశాలీ సేవాభవన్‌ అధ్యక్షుడు అవ్వారు సుబ్బరాయుడు, రిటైర్డు లెక్చరర్‌ మామిళ్ల వెంకటసుబ్బయ్యల చేతుల మీదుగా 2024 నూతన సంవత్సర వార్షిక క్యాలెండర్‌, డైరీలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి బీవీ క్రిష్ణయ్య, ఉపాధ్యక్షుడు వద్ది మాధవ, సంయుక్త కార్యదర్శి లోకేష్‌, వద్ది చైతన్య, ఏపీటీఎఫ్‌ నాయకులు సీవీ ప్రసాద్‌, మామిళ్ల సునీల్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలీ ఉద్యోగ సంక్షేమ సంఘం

అధ్యక్షుడు గునిశెట్టి శ్రీనివాసులు

Advertisement
Advertisement