Sakshi News home page

నిర్మాత ఏడిద నాగేశ్వరరావు కన్నుమూత

Published Sun, Oct 4 2015 6:36 PM

ప్రముఖ సినీ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు(81) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో ఆదివారం సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఏడిద నాగేశ్వరరావు భౌతికకాయాన్ని బంజారాహిల్స్ లోని రోడ్డు నెంబర్ 8లోని ఆయన స్వగృహానికి తరలించారు.