ఆన్‌లైన్‌లో ‘లైలా’ దుమ్మురేపుతోంది! | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో ‘లైలా’ దుమ్మురేపుతోంది!

Published Fri, Dec 23 2016 10:47 AM

బాలీవుడ్‌ శృంగార భామ సన్నీ లియోన్‌.. ’లైలా మై లైలా’ అంటూ ఉర్రూతలూగిస్తోంది. తొలిసారి షారుఖ్‌తో కలిసి ఆడిపాడిన ఈ అమ్మడు.. అదరగొట్టే స్టెప్పులు, టీజింగ్‌ లుక్‌తో ఆకట్టుకుంది. షారుఖ్‌ఖాన్‌ తాజా చిత్రం ’రాయిస్‌’లో ఓ స్పెషల్‌ ఐటెం సాంగ్‌లో నర్తించిన సన్నీ.. ఊహించినట్టే తన అందచందాలతో మతిపోగోడుతోంది. ఇటీవల ఆన్‌లైన్‌లో విడుదల చేసిన ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది. షారుఖ్‌ గంభీరమైన లుక్ కనిపించగా‌.. ఐటెం సాంగ్‌కు కావాల్సిన ఘాటైన హుషారెత్తించే డ్యాన్స్‌లతో సన్నీ అలరించింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement