బహిరంగంగా చెత్త కాలిస్తే 25వేల జరిమానా | Sakshi
Sakshi News home page

బహిరంగంగా చెత్త కాలిస్తే 25వేల జరిమానా

Published Fri, Dec 23 2016 7:30 AM

కాలుష్య నివారణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను తగలబెట్టడాన్ని జాతీయ హరిత ట్రిబ్యూనల్‌(ఎన్ జీటీ) పూర్తిగా నిషేధించింది. చెత్త డంపింగ్‌ ప్రదేశాల్లోసహా ఎక్కడ చెత్తను దగ్ధంచేసినా వ్యక్తి లేదా సంస్థకు రూ.25,000 జరిమానా విధిస్తామని ఎన్ జీటీ స్పష్టంచేసింది. తక్కువ మొత్తంలో చెత్తను తగలబెడితే రూ.5,000 జరిమానా విధిస్తామని ఎన్జీటీ చైర్‌పర్సన్ జస్టిస్‌ స్వతంతర్‌ కుమార్‌ నేతృత్వంలోని బెంచ్‌ తెలిపింది.

Advertisement
Advertisement