సిరియాలో నరమేధం | Sakshi
Sakshi News home page

సిరియాలో నరమేధం

Published Wed, Apr 5 2017 2:37 PM

యుద్దవిమానాలు విష రసాయనాలతో వాయువ్య సిరియాపై జరిపిన దాడి 58 మంది అమాయకుల ప్రాణాలను బలిగొంది. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు. రెబెల్స్‌ ఆధీనంలోని ఇడ్లిబ్‌ ప్రావిన్స్‌ పరిధిలోగల ఖాన్‌ షేఖున్‌ ప్రాంతంలో ఈ దాడి జరిగింది. విషవాయువు ప్రభావానికి లోనైన అనేకమంది శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్నారని సిరియాలోని మానవ హక్కుల సంస్థ పేర్కొంది. వీరి సంఖ్య దాదాపు 200 వరకూ ఉండొచ్చని తెలిపింది. అంతేకాకుండా స్పృహకోల్పోవడం, వాంతులు, నోటి నుంచి నురుగు రావడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయని పేర్కొంది. యుద్ధవిమానాలు విడిచిపెట్టిన వాయువు స్వభావాన్ని బ్రిటన్‌ కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ నిర్ధారించలేకపోయింది. ఈ దాడులకు పాల్పడింది సిరియా యుద్ధ విమానాలా? లేక రష్యాకు చెందినవా? అనేది తెలియరాలేదు.