‘ఆన్‌లైన్’తో ప్రమాదమూ ఉంది! | Sakshi
Sakshi News home page

‘ఆన్‌లైన్’తో ప్రమాదమూ ఉంది!

Published Wed, Dec 7 2016 7:40 AM

‘‘ఇది ఇంటర్నెట్ యుగం. ఇంటర్నెట్‌తో ఎన్ని ప్రయోజనాలున్నాయో అంతే ముప్పు పొంచి ఉంది. సైబర్ నేరగాళ్లు ఎంతో నైపుణ్యంతో టెక్నాలజీని వాడుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నగదు రహిత లావాదేవీ లను ప్రోత్సహిస్తున్నారుు. భారీగా ప్రజలు నగదు రహిత లావాదేవీలకు మళ్లినప్పుడు తప్పకుండా మోసాలూ జరుగుతారుు. ‘క్యాష్ లెస్’తో కొత్త దారుల్లో నేరగాళ్లు విజృంభి స్తారు. రాబోయే రోజుల్లో హ్యాకర్లు, సైబర్ నేర గాళ్లు, టైస్టులు పేట్రేగిపోయే ప్రమాద ముంది..’’అని డీజీపీ అనురాగ్‌శర్మ హెచ్చరిం చారు. భవిష్యత్ పోలీసింగ్ ఇదేనని, సైబర్ నేరాల ఫిర్యాదులు వచ్చినప్పుడు ఎలా దర్యా ప్తు జరపాలన్న అంశంపై పోలీసులు సిద్ధమై ఉండాలని సూచించారు. ‘సైబర్ భద్ర త-నగదు రహిత లావాదేవీలు’ అంశంపై మంగళవారం నేర పరిశోధక విభాగం (సీఐ డీ) నిర్వహించిన సదస్సులో డీజీపీ మాట్లాడారు. సైబర్ నేరాల దర్యాప్తు కోసం ప్రతి జిల్లాలో సైబర్ క్రైం విభాగం, ల్యాబ్‌ను ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

Advertisement
Advertisement