Sakshi News home page

4 ప్రాజెక్టుల్లో మార్పులకు ఓకే!

Published Fri, Feb 3 2017 7:28 AM

కృష్ణా, గోదావరి నదీ జలాల్లో హక్కుగా కలిగిన నీటిని సంపూర్ణంగా వినియోగించుకునేలా పలు ప్రాజెక్టుల పరిధిలో చేసిన మార్పులు చేర్పులు (రీ ఇంజనీరింగ్‌)కు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. సాగు, ఇతర అవసరాలకు ఎక్కువ రోజులు నీటిని అందు బాటులో ఉంచడం, గ్రావిటీ ద్వారా వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీరందిం చడం, ముంపు తక్కు వగా ఉండేలా చూడ టం, అదనపు రిజ ర్వాయర్ల నిర్మా ణం వంటి అంశాలకు ప్రాధాన్య మిస్తూ కాళేశ్వరం, దేవాదుల, ఇందిరమ్మ వరదకాల్వ, తుపాకులగూడెం, పాలమూరు ప్రాజెక్టుల్లో రీఇంజనీరింగ్‌కు ఆమోదం తెలిపింది. సాగు విస్తీర్ణాన్ని పెంచే అంశాలకు ప్రాధాన్యమిస్తూ ప్రణాళికలను ఖరారు చేసింది. ఈ ప్రాజెక్టుల పరిధిలో సవరించిన అంచనాలతో సుమారు రూ.20 వేల కోట్ల అదనపు భారం పడనుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement