‘ఒబామాకేర్’పై ట్రంప్ యూటర్న్ | Sakshi
Sakshi News home page

‘ఒబామాకేర్’పై ట్రంప్ యూటర్న్

Published Sun, Nov 13 2016 7:24 AM

అమెరికా అధ్యక్షుడిగా గెలిచిన వెంటనే ట్రంప్ యూ టర్న్ తీసుకున్నారు. ఒబామా హెల్త్‌కేర్ చట్టాన్ని కొన్ని మార్పులతో కొనసాగించనున్నట్లు సంకేతాలిచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ఒబామా ఆరోగ్య సంరక్షణ చట్టాన్ని రద్దు చేస్తానని ట్రంప్ చెప్పడం తెలిసిందే. అరుుతే శ్వేతసౌధంలో గురువారం ఒబామాతో మట్లాడాక ట్రంప్ స్వరం మారినట్టు కనిపిస్తోంది. ఈ మేరకు వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఆరోగ్య సంరక్షణ చట్టం రద్దును పునఃపరిశీలించాలని ట్రంప్‌తో భేటీలో ఒబామా కోరినట్టు పేర్కొంది. ‘ఒబామా కేర్ మార్పులతో కొనసాగించడమో రద్దు చేయడమే చేస్తాం. ఒబామాపై గౌరవంతో ఆయన సూచనల్ని పరిగణనలోకి తీసుకుంటాం’ అని భేటీ తర్వాత ట్రంప్ అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement