నాడు ఎంజీఆర్.. నేడు జయ | Sakshi
Sakshi News home page

నాడు ఎంజీఆర్.. నేడు జయ

Published Tue, Dec 6 2016 7:06 AM

అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్, జయలలిత అనేక అంశాల్లో ఒకే ఒరవడిని సృష్టించుకున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీని అప్రతిహతంగా పరుగులు పెట్టించిన ఆనాటి ఎంజీఆర్ రాజకీయ వారసురాలు జయలలిత పార్టీని విజయకేతనంలో నడిపించడంలోనే కాదు, అనారోగ్యంలోనూ వారసురాలిగా నిలిచారు. వివరాల్లోకి వెళితే...ఎంజీఆర్, జయలలిత ఇద్దరూ సినిమా నేపథ్యం నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎంజీఆర్ పురట్చి తలైవర్(విప్లవ నాయకుడు), జయలలిత పురట్చితలైవీ(విప్లవ నాయకి)గా పేరుగాంచారు. అన్నాడీఎంకే అధికారంలో ఉండగా అస్వస్థతకు లోనైన ఎంజీఆర్ 1984 అక్టోబరు 5న అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు.

Advertisement
Advertisement