ఏమనుకున్నావ్‌.. పేగులు తీస్తా: మంత్రి | Sakshi
Sakshi News home page

ఏమనుకున్నావ్‌.. పేగులు తీస్తా: మంత్రి

Published Wed, Jun 28 2017 7:30 PM

‘నువ్వు ఎవడ్రా జిల్లా తెమ్మని నన్ను అడగడానికి.... పేగులెల్లుతయ్‌ బిడ్డ. నేను గట్టిగ తొక్కిన్నంటే’అంటూ మంత్రి చందూలాల్‌ బూతు పురాణం అందుకున్నారు. ములుగు–సమ్మక్క సారలమ్మ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు ముంజాల భిక్షపతిని ఈ మేరకు తీవ్ర స్వరంతో హెచ్చరించారు. నువ్వెం త నీ బతుకెంత అంటూ నోటికొచ్చి నట్లు తిట్టారు. వీరిద్దరి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం వాట్సాప్‌ గ్రూపుల్లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ నెల 26 రాత్రి ఈ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై మంత్రి చందూలాల్‌ను సంప్రదించగా... ఇదో వార్తా ? వంద సవాళ్లు వస్తుంటయ్‌ మాకు. వాడో చిల్లర గాడు, వాడి వాయిస్‌తోని మీరు ఎందుకు వార్త రాస్తరు, రాత్రి పదిగంటలకు ఫోన్‌ చేసి ఇష్టమొచ్చినట్టు మాట్లాడినందుకు వాడి మీద పోలీస్‌ కంప్లైంట్‌ ఇస్తని సమాధానం ఇచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement