Sakshi News home page

పెట్రోలియం డీలర్ల నిరసన విరమణ

Published Sat, Nov 5 2016 6:51 AM

కమీషన్ పెంపు వ్యవహరంపై చమురు కంపెనీలకు, పెట్రోల్ బంక్ డీలర్లకు మధ్య నెలకొన్న వివాదానికి తెరపడినట్లరుుంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలకు సంబంధించి కమీషన్ పెంపునకు చమురు సంస్థలు అంగీకరించడంతో తాము చేపట్టదలచిన నిరసన కార్యక్రమాన్ని విరమించుకుంటున్నట్లు తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జీ.వినయ్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం ముంబైలో చమురు కంపెనీలతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతకు ముందు నిరసన కార్యక్రమంలో భాగంగా పెట్రోల్ సింగిల్ షిఫ్ట్ విధానంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అమ్మకాలు సాగిస్తామని, ఆదివారం, ప్రభుత్వ సెలవు దినాల్లోనూ బంకులు మూసేస్తామని తీవ్ర నిర్ణయాలను పెట్రోలియం డీలర్లు ప్రకటించారు. చర్చలు సఫలం కావడంతో వారు తమ నిర్ణయాలను ఉపసంహరించుకున్నారు.

Advertisement
Advertisement