ట్రంప్ సంచలన ఆరోపణలు | Sakshi
Sakshi News home page

ట్రంప్ సంచలన ఆరోపణలు

Published Tue, Oct 18 2016 10:43 AM

అమెరికా అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రత్యర్థిపార్టీ, మీడియా కలిసికట్టుగా ఎన్నికల్లో రిగ్గింగ్ కు పాల్పడ్డాయని, నవంబర్ 8న సాధారణ ఓటింగ్ కోసం ఏర్పాటుచేసిన కేంద్రాల్లో కొన్నింటిలోనూ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వరుస ట్వీట్లు చేశాసిన ట్రంప్.. ఓటమి భయంతోనే డెమోక్రటిక్ పార్టీ ఇలాంటి కుత్సిత చర్యలకు దిగుతున్నదని మండిపడ్డారు. రిగ్గింగ్ వ్యవహారంపై సొంతపార్టీ (రిపబ్లికన్) నేతలు మౌనంగా ఉండటాన్ని ఆక్షేపించారు