సెంట్రల్ వర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

సెంట్రల్ వర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య

Published Sat, Sep 17 2016 9:23 AM

వేముల రోహిత్ ఆత్మహత్య ఘటన మరవకముందే సెంట్రల్ యూనివర్సిటీలో మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంఎఫ్ఏ ఫైన్ ఆర్ట్స్ ఫస్ట్ ఇయర్ విద్యార్థి ప్రవీణ్ శుక్రవారం అర్థరాత్రి ఎల్ బ్లాక్ రూమ్ నంబర్ 204లో ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి ఆత్మహత్యపై సహచర విద్యార్థులు యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించారు. యూనివర్సిటీ వీసీ పి. అప్పారావు హుటాహుటిన ఎల్ బ్లాక్కు చేరుకున్నారు. ప్రవీణ్ ఆత్మహత్యకు గల కారణాలు ఏమిటో ఇంతా తెలియలేదని వీసీ అప్పారావు తెలిపారు. ఈ ఏడాది జులైలోనే ప్రవీణ్ ఎంఎఫ్ఏ కోర్సులో జాయిన్ అయ్యాడని చెప్పారు.

Advertisement
Advertisement