ట్రంప్‌కు తాలిబాన్‌ బహిరంగ లేఖ | Sakshi
Sakshi News home page

ట్రంప్‌కు తాలిబాన్‌ బహిరంగ లేఖ

Published Wed, Aug 16 2017 9:01 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు ముస్లిం తీవ్రవాద సంస్థ తాలిబాన్‌ బహిరంగ లేఖ రాసింది. అఫ్ఘానిస్తాన్‌లో తిష్టవేసిన అమెరికా బలగాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరింది. గత పదహారేళ్లుగా అమెరికా బలగాలు అఫ్ఘానిస్తాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇంగ్లీషులో 1600 పదాలతో సుదీర్ఘంగా రాసిన ఆ లేఖను మంగళవారం తాలిబాన్‌ నాయకత్వం పత్రికలకు విడుదల చేసింది. గత అమెరికా అధ్యక్షులు అఫ్ఘానిస్తాన్‌ విషయంలో చేసిన పొరపాట్లను, తీసుకున్న నిర్ణయాలను పునస్సమీక్షిస్తామనటం ద్వారా తప్పిదాలను అంగీకరించినట్లయిందని తాలిబాన్‌ అధికార ప్రతినిధి జబీబుల్లా ముజాహిద్‌ ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement