మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

మాఫియా డాన్ చోటా రాజన్ అరెస్ట్

Published Tue, Oct 27 2015 6:36 AM

అండర్‌వరల్డ్ డాన్, గ్యాంగ్‌స్టర్ చోటా రాజన్(55) అరెస్టయ్యాడు. ఇంటర్‌పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసిన నేపథ్యంలో ఇండోనేసియాలోని ప్రముఖ పర్యాటక ద్వీపం బాలిలో ఆ దేశ పోలీసులు ఆదివారం చోటా రాజన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి బాలికి వచ్చిన రాజన్‌ను ఆస్ట్రేలియా పోలీసులిచ్చిన సమాచారంతో బాలి విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు.

Advertisement
Advertisement