నకిలీ డాక్టర్‌ అరెస్టు | Sakshi
Sakshi News home page

నకిలీ డాక్టర్‌ అరెస్టు

Published Sat, Nov 18 2017 3:46 PM

అనధికారికంగా క్లినిక్‌లు నిర్వహిస్తున్న వారిపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీజీపీ ఆదేశాల మేరకు విజిలెన్స్‌ ఎస్పీ రామప్రసాదరావు ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లాలోని పలుచోట్ల దాడులు నిర్వహించారు. ఐఎల్‌టీడీ సెంటర్‌లోని సాయిక్లినిక్‌పై విజిలెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సత్యకిషోర్, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపాలకృష్ణ, అడిషనల్‌ డీఎంఅండ్‌హెచ్‌ఓ డాక్టర్‌ కోమలి దాడులు నిర్వహించారు. ద్వారపూడి పీహెచ్‌సీలో కాంట్రాక్టు పద్ధతిలో హెల్త్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పీఎస్‌ రంగప్రసాద్‌ అనధికారికంగా ఈ క్లినిక్‌ను నిర్వహిస్తున్నాడు. ప్రిస్కిప్షన్‌ వినియోగంతోపాటు, పేరుకు ముందు డాక్టర్‌ అనే పదాన్ని సైతం వినియోగిస్తున్నాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement