Sakshi News home page

ప్రపంచ అతిపెద్ద విమానం క్రాష్‌ల్యాండ్‌!

Published Wed, Aug 24 2016 7:30 PM

అది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. 320 అడుగుల పొడవు, రూ. 222 కోట్ల (25మిలియన్‌ పౌండ్ల) ఖర్చుతో రూపొందిన ఎయిర్‌ల్యాండర్‌-10 గాలిలోకి ఎగిరిన ఏడురోజులకే క్రాష్‌ ల్యాండ్‌ అయింది. 'ఫ్లయింగ్‌ బమ్‌' అని ముద్దుగా పిలుచుకునే ఈ విమానం బుధవారం ల్యాండ్‌ అయ్యే సమయంలో సమీపంలో ఉన్న ఓ టెలిగ్రాఫ్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. విమానం సవ్యంగా ల్యాండ్‌ కాకపోవడంతో కాక్‌పిట్‌ ధ్వంసమైంది. బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో ఈ ఘటన జరిగింది. అయితే, విమానం చాలా నెమ్మదిగా దిగుతూ ఉండటం వల్ల క్రాష్‌ల్యాండ్‌ అయినా పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. అయితే, క్రాష్‌ల్యాండ్‌ అయ్యే సమయంలో భూమి బద్దలైనట్టు అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.