కుర్రాళ్లు ‘ఆసియా’ను కొట్టేశారు | Sakshi
Sakshi News home page

కుర్రాళ్లు ‘ఆసియా’ను కొట్టేశారు

Published Sat, Dec 24 2016 7:51 AM

ఆసియా కప్‌ అండర్‌–19 క్రికెట్‌ టోర్నమెంట్‌లో భారత యువ జట్టు వరుసగా మూడోసారి విజేతగా నిలి చింది. శుక్రవారం ఇక్కడి ప్రేమదాస స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్‌ 34 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. ముందుగా భారత్‌ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేయగా... ఆ తర్వాత శ్రీలంక 48.4 ఓవర్లలో 239 పరుగులకే ఆలౌటైంది. హిమాన్షు రాణా (71; 6 ఫోర్లు, 1 సిక్స్‌), శుభ్‌మన్‌ గిల్‌ (70; 4 ఫోర్లు) భారత ఇన్నింగ్స్‌లో కీలక పాత్ర పోషించగా... శ్రీలంక ఆటగాళ్లు రెవెన్‌ కెల్లీ (62; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెప్టెన్‌ కామిందు మెండిస్‌ (53; 4 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. తన లెఫ్టార్మ్‌ స్పిన్‌తో కీలక వికెట్లు పడగొట్టిన భారత కెప్టెన్‌ అభిషేక్‌ శర్మ (4/37) ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలవగా... టోర్నీలో 5 మ్యాచ్‌లలో కలిపి 283 పరుగులు చేసిన హిమాన్షు రాణా ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’ అవార్డును గెలుచుకున్నాడు. గెలుపు కోసం 75 బంతుల్లో 78 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచిన శ్రీలంక, 43 పరుగుల వ్యవధితో తమ చివరి 7 వికెట్లు కోల్పోయి పరాజయంపాలైంది.