223వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

223వ రోజు వైఎస్ జగన్ పాదయాత్ర డైరీ

Published Mon, Jul 30 2018 6:54 AM

ఈ రోజు జగ్గంపేట నియోజకవర్గంలోని రామవరం, గోనేడ, రామచంద్రపురం గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. ఎన్నికల ముందు మభ్యపెట్టి, మాయ మాటలు చెప్పి పబ్బం గడుపుకొనే రాజకీయ నైజాన్ని మరోమారు బయటకు తీస్తోందీ అధికార పార్టీ. ‘ఎన్నికలకు ఆరు నెలల ముందు.. నాలుగు నెలల కోసం’ అనే నాటకానికి తెరతీసిందని చెప్పడానికి.. ఈ రోజు నన్ను కలిసిన సోదరి కమ్మరి చంద్ర, ఉంగరాల అప్పారావు అన్న చెప్పిన మాటలే సాక్ష్యం.   పాదయాత్ర శిబిరం చెంతనే సోదరి కమ్మరి చంద్ర కలిసింది. పూర్తి వైకల్యం బారినపడ్డ తన ఆరేళ్ల కూతురును ఎత్తుకుని వచ్చిన ఆమె.. వైఎస్‌ కుటుంబం అంటే తమకెంతో అభిమానమని చెప్పింది.