ఇషా కోసం ఆకాశ్‌ అంబానీ భావోద్వేగ ప్రసంగం | Sakshi
Sakshi News home page

ఇషా కోసం ఆకాశ్‌ అంబానీ భావోద్వేగ ప్రసంగం

Published Thu, May 10 2018 1:14 PM

బిలీనియర్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్‌ అంబానీ గారాల పట్టి ఇషా అంబానీ వివాహం, బిజినెస్‌ టైకూన్‌ అజయ్‌ పిరమల్‌ కుమారుడు ఆనంద్‌ పిరమల్‌తో నిశ్చయమైన సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితమే ఇషా, ఆనంద్‌ల ఎంగేజ్‌మెంట్‌ పార్టీని ముఖేష్‌ అంబానీ ఫ్యామిలీ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసింది. ఈ వేడుకకు బాలీవుడ్‌ ప్రముఖులు, క్రికెట్‌ దిగ్గజాలు హాజరయ్యారు. ఇషా అంబానీ ఎంగేజ్‌మెంట్‌ పార్టీకి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో ఫుల్‌గా షేర్‌ అవుతున్నాయి. తల్లి నీతా అంబానీ, తండ్రి ముఖేష్‌తో ఇషా వేసిన స్టెపులు, బాలీవుడ్‌ దిగ్గజాలతో దిగిన ఫోటోలు ఇంటర్నెట్‌లో మంచి వ్యూస్‌ను సంపాదించుకుంటున్నాయి. తాజాగా అంబానీ బ్రదర్లు ఆకాశ్‌, ఆనంత్‌లు సోదరి ఇషా, బావ ఆనంద్‌తో కలిసి ఉన్న ఓ వీడియో వైరల్‌ అవుతోంది.

Advertisement
Advertisement