‘మీరు ఒలింపిక్స్‌లోట్రై చేయొచ్చు కదా..?!’ | Sakshi
Sakshi News home page

‘మీరు ఒలింపిక్స్‌లోట్రై చేయొచ్చు కదా..?!’

Published Fri, Jan 25 2019 10:03 AM

చిన్నప్పుడు ఇంట్లో అల్లరి పనులు చేయడం.. తర్వాత అమ్మ చేతిలో తన్నులు తినడం దాదాపు అందిరి జీవితాల్లో జరిగే చాలా సాధరణ సంఘటన. దెబ్బల నుంచి తప్పించుకోవడం కోసం వీధుల వెంబడి పరిగెత్తిన వారు కూడా ఉంటారు. మన దగ్గర ఏమో కానీ పంజాబీ తల్లులు మాత్రం పిల్లలకు ఇలా పరిగెత్తే చాన్స్‌ ఇవ్వరు. తప్పించుకోవడం కోసం పరిగెత్తే పిల్లల్ని ఆపడానికి వారి మీదకు చెప్పునో, షూనో విసిరేస్తారు. దరిద్రం కొద్ది చెప్పు తగిలి కింద పడ్డారా.. అప్పుడుంటది ఇక.. వీపు విమానం మోత మోగాల్సిందే.చిన్నప్పుడు ఇలా దెబ్బలు తినడం ఓకే కానీ టీనేజ్‌కొచ్చాక కూడా ఇలాంటి పరిస్థితి వస్తే.. ఎలా ఉంటుంది. ఈ వీడియోలో చూపినట్లు ఉంటుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోన్న ఈ వీడియోలో ఓ తల్లి తప్పించుకు పారిపోతున్న కూతుర్ని ఆపడానికి పంజాబీ తల్లులు చేసే​ ప్రయోగం చేసింది. మెక్సికోలో జరిగింది ఈ సంఘటన. తల్లీకూతులిద్దరి మధ్య ఏదో గొడవ జరిగింది. కోపంతో ఉన్న తల్లి కూతుర్ని కొట్ట బోయింది. కానీ కూతరు తప్పించుకోవడం కోసం రోడ్డు మీద పరిగెత్తింది. దాంతో విచక్షణ కోల్పోయిన తల్లి చెప్పు తీసుకుని కూతురి మీదకు విసిరేసింది. అది కూడా 30 మీటర్ల దూరంలో ఉండగా.ఆశ్చర్య ఆ చెప్పు సరిగ్గా వెళ్లి ఆ అమ్మాయికి తగిలడం.. కింద పడిపోవడం క్షణాల్లో జరిగాయి. గురి తప్పకుండా చెప్పు విసిరిన ఆమె కోపాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు. ఒలింపిక్స్‌లో ట్రై చేస్తే రికార్డలన్నీ మీవే అంటూ కామెంట్‌ చేస్తున్నారు.