డోక్లాంలో మళ్లీ రోడ్డేసిన చైనా | Sakshi
Sakshi News home page

డోక్లాంలో మళ్లీ రోడ్డేసిన చైనా

Published Wed, Dec 13 2017 10:28 AM

సిక్కింకు తూర్పు దిక్కున డోక్లాం ప్రాంతంలో చైనా తాజాగా రెండు రోడ్లను నిర్మించినట్లు ఉపగ్రహ చిత్రాలు తెలుపుతున్నాయి. గతంలో సరిహద్దులోచైనా రోడ్డు నిర్మాణ పనులను భారత్‌ వ్యతిరేకించడంతో డోక్లాంలో ఇరు దేశాలు సైనికులను మోహరించడం తెలిసిందే. 70 రోజుల ప్రతిష్టంభన తర్వాత ఇరుదేశాలూ ఆ ప్రాంతంలో సైన్యాన్ని ఉపసంహరించాయి. ఆ తర్వాత కూడా చైనా 1, 1.2 కిలో మీటర్ల పొడవైన రెండు రోడ్లను సరిహద్దులో నిర్మించినట్లు, గతంలో సైనికులను మోహరించిన చోటుకు అవి వరసగా 4.5 కిలోమీటర్లు, 7.3 కి.మీ దూరంలో ఉన్నట్లు తాజాగా ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలుస్తోంది. గత 13 నెలల కాలానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను పరిశీలించగా, ఈ రెండు రోడ్లు అక్టోబర్‌ 17 నుంచి డిసెంబర్‌ 8 మధ్య నిర్మితమైనట్లు స్పష్టమవుతోంది.

Advertisement
Advertisement