నేడు అంతరిక్షంలోకి జీఎస్‌ఎల్‌వీ | Sakshi
Sakshi News home page

నేడు అంతరిక్షంలోకి జీఎస్‌ఎల్‌వీ

Published Fri, May 5 2017 6:44 AM

భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీష్‌ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌)లోని రెండో ప్రయోగ వేదిక నుంచి శుక్రవారం సాయంత్రం 4.57 నిమిషాలకు జీఎస్‌ ఎల్‌వీ ఎఫ్‌09 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించనున్నారు. దీనికి సంబంధించి గురువారం మధ్యా హ్నం 12.57 నిమిషాలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభ మైంది. ఈ రాకెట్‌ ద్వారా 2,230 కిలోల బరువు కలిగిన విశాట్‌–9(దక్షిణాసియా దేశాల శాటిలైట్‌) ఉపగ్రహాన్ని భూమికి 36వేల కి.మీ ఎత్తులోని భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉపగ్ర హంలో 12 కేయూ బ్రాండ్‌ ట్రాన్స్‌ఫార్మర్స్‌ను అమర్చారు. దక్షిణాసియా దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, భారత్, మాల్దీవులు దేశాలకు ఈ ఉపగ్రహం 12 ఏళ్లపాటు సేవలందించనుంది.