మళ్లీ నిత్యానందకు కష్టాలు | Sakshi
Sakshi News home page

మళ్లీ నిత్యానందకు కష్టాలు

Published Thu, Nov 23 2017 8:03 AM

వివాదస్పద ఆధ్యాత్మిక గురువు స్వామి నిత్యానందకు మరిన్ని చిక్కులు తప్పేలా లేవు. తన అనుంగు శిష్యురాలు రంజితతో కలిసి సన్నిహితంగా... వీడియో టేపులలో ఉన్నది స్వామి నిత్యానందేనని ఢిల్లీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ స్పష్టం చేసింది. దీంతో ఈ సాములోరు మరోసారి వార్తల్లో నిలిచారు. కాగా నటి రంజితతో కలిసి ఉన్న రాసలీలల వీడియోల్లో ఉన్నది తాను కాదని, మార్ఫింగ్‌ జరిగిందంటూ ఇప్పటివరకూ నిత్యానంద వాదిస్తూ వచ్చారు. అయితే సీడీల్లో ఉన్నది నిత్యానందేనని ధ్రువీకరిస్తూ... ఢిల్లీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఇచ్చిన ఓ నివేదిక బుధవారం వెలుగులోకి వచ్చింది.

Advertisement
Advertisement