షాకిచ్చిన చిరుజల్లు.. ప్లైఓవర్‌ పైకి నో | Sakshi
Sakshi News home page

షాకిచ్చిన చిరుజల్లు.. ప్లైఓవర్‌ పైకి నో

Published Fri, Mar 16 2018 4:02 PM

నిత్యం తీరిక లేకుండా గడిపే నగర వాసుల పరుగుకు కొద్ది సేపు బ్రేక్‌ పడింది. ముఖ్యంగా రయ్‌మంటూ దూసుకెళ్లే బైక్‌ రైడర్లకు (ద్విచక్ర వాహనదారులు) కళ్లెం పడింది. దాదాపు ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో అనుకోని అతిథిలా చిరుజల్లు వచ్చి వారిని కొద్దిసేపు పరేషాన్ చేసింది. వారితో కొద్దిసేపు అడుకున్నట్లుగా కిందపడేసి నవ్విపోయింది. అవును.. శుక్రవారం ఉదయం నగరాన్ని కొన్ని చోట్ల చిరు చినుకులు పలకరించాయి. ముఖ్యంగా విద్యానగర్‌ నుంచి ఖైరతాబాద్‌ వరకు పడిపడనట్లుగా చినుకులు రాలాయి. దాంతో రోడ్డుపై ఉన్న దుమ్ముధూళి కాస్త కొంత జిగట రూపాన్ని సంతరించుకొని రోడ్డుపై పరుచుకుంది.