Sakshi: Telugu Breaking News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu News Today
Sakshi News home page

Top Stories

Advertisement

ప్రధాన వార్తలు

Minister Kakani Govardhan Reddy Challenges To Somireddy
పచ్చ మందకు వాతలు పెట్టిన కాకాణి

నెల్లూరు: బెంగళూరు రేవ్‌ పార్టీ అంశానికి సంబంధించి తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న ‘పచ్చమంద’కు మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి వాతలు పెట్టారు. తనకు సంబంధాలు ఉన్నా, తనకు సంబంధించిన వారు ఎవరున్నా చర్యలు తీసుకోవచ్చాన్నారు కాకాణి. ఎవరో అనామకుడు తన కారు స్టిక్కర్‌ను జిరాక్స్‌ తీసి వాడుకుంటే అందులో తాను ఉన్నానంటూ పచ్చ మంద రాద్దాంతం చేస్తుందని కాకాణి ధ్వజమెత్తారు.‘నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా?‘బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?, నెల్లూరులో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తాఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుంది. ఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలి. బెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నా. బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ? , రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది.బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదు.రేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు పాసు పోర్ట్ నా దగ్గరే ఉంది.కుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరాను.రోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు.సో మిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్’ అంటూ మండిపడ్డారు.‘రేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిది. సోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయి. నాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారు. యూత్ మినిస్టర్‌గా ఉండి క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిది. నా పాస్ పోర్ట్ నెల్లూరులో ఉంది. కారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా’ అని కాకాణి తెలిపారు.

Ksr Comments On Eenadu Ramojirao's False Statements And Jawahar Reddy's Behavior
వైఎస్సార్‌సీపీ గెలుపును ఖరారు చేసిన ఎల్లో మీడియా!.. ఈ రాతలు అందుకేనా?

ఏపీలో శాసనసభ ఎన్నికలు ముగిశాయి కనుక ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియాలో మార్పు వస్తుందేమోలే అని ఆశించినవారికి యధాప్రకారం ఆశాభంగమే ఎదురైంది. ఎన్నికల ముందు ఎలాగైతే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిను, ఆయన ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి విశ్వయత్నం చేశారో, వైఎస్సార్‌సీపీపై విషం కక్కారో అదే ధోరణి ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. అవే అబద్దాలు, అవే మోసపూరిత కథనాలు, కక్ష, విద్వేషంతో కూడిన వార్తలు రాస్తూ ప్రజలను ఇంకా తప్పుదారి పట్టించాలని చూస్తున్నారు.ఎన్నికల పోలింగ్ జరిగిన రోజున, పోలింగ్ అయిన తర్వాత జరిగిన హింసపై వారు తెలుగుదేశం పార్టీని భుజాన వేసుకున్న తీరు నీచంగా ఉంది. టీడీపీ వారిని రక్షించడానికి, వారి ప్రమేయంతో నియమితులైన పోలీసు అధికారులకు ఎలాంటి సమస్య రాకుండా చేయాలన్న లక్ష్యంతో వారు రాస్తున్న వార్తలు జర్నలిజం ప్రమాణాలను దిగజార్చుతూనే ఉన్నాయి. ఈ ఘటనలలో ఇరు వర్గాల తప్పులు ఉంటే వాటిని రిపోర్టు చేయవచ్చు. అలాకాకుండా ఏకపక్షంగా రాస్తున్న తీరును బట్టే ఈ అల్లర్లు పెత్తందార్లే చేశారని అర్థం అవుతుంది. బలహీనవర్గాలపై జరిగిన దాడుల పట్ల కూడా మానవత్వం లేకుండా రామోజీ వార్తలు రాయించారంటే పేదలపై ఎంతటి పగ పట్టారో తెలుస్తుంది.ఎన్నికల సంఘం ఈ దాడులపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించాలని ఆదేశిస్తే, ఆ ప్రకారం ప్రభుత్వం కొంతమంది అధికారులను ఎంపిక చేసింది. అంతే!ఈనాడు రామోజీకి నచ్చలేదట. వారందరికి రాజకీయాలు అంటగడుతూ రాసేశారు. అంటే ముందస్తుగానే సిట్ అధికారులను ప్రభావితం చేయడానికి, భయపెట్టడానికి వీరు ప్రయత్నం చేశారన్నమాట. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిపై వారు ఇచ్చిన స్టోరీలు చూస్తే వీరు ఉగ్రవాదుల కన్నా ఘోరంగా మారారన్న సంగతి ఇట్టే అర్థం అయిపోతుంది. ఈనాడు రామోజీరావు రాస్తే ఎవరినైనా ఉద్యోగం నుంచి తీసివేయాల్సిందే. ఆయన ఎవరిని కోరితే వారిని ఆయా పోస్టులలో నియమించాల్సిందే. లేకుంటే వారిపై బండలు వేస్తాం. వారిని నైతికంగా దెబ్బతీస్తాం. ఈ క్రమంలో వారు చెప్పినట్లు వింటే సరి.. ఎక్కడైనా ఒకటి, రెండు విషయాలలో మరీ బాగుండదని వినకపోతే.. ఇంకేముంది.. ఎన్నికల సంఘాన్ని వదలిపెట్టం అన్న రీతిలో దారుణమైన కథనాలు వండి పాఠకులను మోసం చేస్తున్నారు.ఇలా ఒకటి కాదు.. ఎక్కడ వీలైతే అక్కడ మళ్లీ బురద వేయడం చేస్తున్నారు. ఎన్నికలు అయ్యాయో, లేదో ఇంకా డీబీటీ కింద లబ్దిదారులకు డబ్బులు ఎందుకు వేయలేదని రాశారు. పేదలకు కాకుండా కాంట్రాక్టర్‌లకు డబ్బులు ఇస్తున్నారని ప్రచారం చేశారు. కానీ ప్రభుత్వం తన డ్యూటీ ప్రకారం ఆయా స్కీముల కింద నిధులు విడుదల చేసింది. ఇంకా వారికి ఇవ్వలేదు.. వీరికి ఇవ్వలేదు.. అంటూ పిచ్చి కథనాలు ఇస్తున్నారు. కాంట్రాక్టర్‌లకు డబ్బులు ఇవ్వకపోతే చేసిన పనులకు బిల్లులు రాక వారు ఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని రాసేది వీరే. బిల్లులు చెల్లిస్తుంటే స్కీముల డబ్బును కాంట్రాక్టర్‌లకు ఇస్తున్నారని రాసేది వీళ్లే.రాజకీయ నేతలు డబుల్ టాక్ చేయడంలో దిట్టలని అనుకుంటాం. అందులో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వంటి నేతలు డాక్టరేట్ సంపాదించారని అంతా భావిస్తారు. కానీ వారిని మించి రామోజీరావు, రాధాకృష్ణ వంటి ఎల్లో మీడియా వారు ఏది పడితే అది రాసి పరువు పోగొట్టుకుంటున్నారు. వీరి పరిస్థితి ఎలా ఉందంటే ఒకసారి పరువు పోయాక, కొత్తగా పోయేదేముందిలే అని సిగ్గు విడిచి వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎన్నికల సంఘం పల్నాడు, తాడిపత్రి, తిరుపతి వంటి చోట్ల జరిగిన హింసపై సిట్ దర్యాప్తు చేయాలని ఆదేశించగానే, టీడీపీకి కొమ్ముకాసి తప్పులు చేసిన అధికారులను రక్షించడానికి ఈ మీడియా పూనుకుంది. వైఎస్సార్‌సీపీవారే హింసకు పాల్పడ్డారని పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నించింది.వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు కానీ, స్వయంగా ఒక మంత్రిగాని ఫోన్ చేస్తే బదులు ఇవ్వని ఎస్పీలను గొప్పవారిగా ప్రొజెక్టు చేయడానికి యత్నించారు. బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి టీడీపీ వారు రాసిన పిర్యాదుపై సంతకం చేసి ఎన్నికల కమిషన్‌కు పంపించారు. అందులో ఏ ఏ అధికారిని తొలగించాలో రాయడమే కాకుండా, ఫలానా వారిని నియమించాలని కూడా కోరడం చిత్రమైన సంగతి. ఎన్నికల సంఘం కూడా ప్రామ్ట్ గా వారు కోరిన విధంగా అధికారులను మార్పు చేసింది. ఆ సమయంలో డీజీపీ, సీఎస్‌ను, ఇంటెలెజజెన్స్ ఉన్నతాధికారిని బదిలీ చేయాలని ఈనాడు పెద్ద ఉద్యమంలా చెడరాసింది. ఈసీ ఒక్క సీఎస్‌ను తప్ప వారు కోరిన వారందరిని బదిలీ చేసింది.కొత్త అధికారులు వైఎస్సార్‌సీపీ ఓటర్లను బెదిరించి ఓటింగ్‌కు రాకుండా చేస్తారని వీరు ఆశించినట్లు ఉన్నారు. అది పూర్తి స్థాయిలో జరగలేదు. అయినా పేదలంతా వెల్లువలా ఓటింగ్‌కు తరలిరావడంతో వీరు ఆశించిన రీతిలో టీడీపీకి ప్రయోజనం కల్పించి ఉండకపోవచ్చు. దాంతో మరుసటి రోజు టీడీపీ వారు హింసాకాండకు దిగారు. నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆస్పత్రిపైన దాడి చేశారు. తాడిపత్రిలో టీడీపీ రౌడీ మూకలు అల్లర్లకు దిగితే పోలీసులు చోద్యం చూస్తున్నట్లు చూస్తూ కూర్చున్నారు. పైగా కొందరు పోలీసులు ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలోకి వెళ్లి అరాచకం చేశారు. అది కనిపించకుండా సీసీ కెమెరాలను కూడా పోలీసులే పగులకొట్టారు. మరో సీసీ కెమెరాలో చిక్కడంతో వారు దొరికిపోయారు. ఈ సన్నివేశం మొత్తం పోలీసు వ్యవస్థకే మచ్చ తెచ్చింది. దాంతో అనంతపురం, పల్నాడు కొత్త ఎస్పీలను ఈసీ సస్పెండ్ చేసింది.ఇది కేవలం తెలుగుదేశం వారి నిర్వాకమే. రామోజీ వంటివారి నీచమైన రాతల ఫలితమే అని చెప్పాలి. మరి కొందరిపై బదిలీ వేటు పడింది. ఇప్పుడు వారిని రక్షించడానికి కంకణం కట్టుకున్న ఈనాడు రామోజీరావు సీఎస్‌పై అడ్డగోలు కథనం రాశారు. మొత్తం ఈ హింసాకాండకు సీఎస్‌ బాధ్యుడని రామోజీ తేల్చేశారు. ఆయన ఎలా బాధ్యుడు అవుతారో అర్థం కాదు. కొత్తగా నియమితుడైన డీజీపీ బాధ్యుడు కాదట. టీడీపీ, ఈనాడు ఏరికోరి వేయించుకున్న ఎస్పీలు బాధ్యులు కాదట. అర్థం, పర్థం లేకుండా ఎన్నికల సంఘం ఎన్నికలకు రెండు, మూడు రోజుల ముందు చేసిన తెలివితక్కువ నిర్ణయాలు కారణం కాదట. ఎన్నికల ప్రక్రియ మొదలయ్యాక సీఎస్‌ వివాదాలకు కేంద్ర బిందువు అయ్యారని రామోజీ తేల్చేశారు.జవహర్ రెడ్డి ఏమి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు? ఈసీ ఏమి చెబితే అది చేశారు తప్ప సొంతంగా ఆయన చేసింది ఏముంది? అయినా రామోజీ మరి అది పార్టీ పక్షపాతమో, కుల పక్షపాతమోకానీ, నిర్లజ్జగా ప్రభుత్వ ఉన్నతాధికారి నైతికస్థైర్యం దెబ్బతినేలా చెత్త వార్తలు రాసి పారేశారు. చేతిలో టీవీ, పేపర్ ఉంది కదా అని, ఎలాగూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆయా వ్యవస్థలలో తమకు పలుకుబడి ఉంది కదా అని ఇంత ఘోరంగా వార్తలు ఇస్తారా? నిజానికి ఇలాంటి వార్తలు రాసిన ఈనాడు రామోజీరావుపై కేసు పెట్టాలి! ఈసీ ఛీఫ్ సెక్రటరీపై ఆధారపడుతూ నిర్ణయాలు చేసిందట. అంటే చంద్రబాబుకో, రామోజీకో ఫోన్ చేసి వారు ఏమి ఆదేశిస్తే అది చేయాలన్నది వీరి కోరిక కావచ్చు. అక్కడికి వీరు అడిగినవన్నీ ఈసీ చేసినా కనీసం కృతజ్ఞత లేకుండా ఈసీని ఆక్షేపిస్తూ వార్తలు ఇచ్చారంటేనే వీరు ఎంత అవకాశవాదులో అర్థం చేసుకోవచ్చు.వృద్దులకు ఇళ్ల వద్ద వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇవ్వద్దని ఈసీ ద్వారా చెప్పించిందే తెలుగుదేశం, ఈనాడు రామోజీ వంటి వారు అయితే దానికి జవహర్ రెడ్డి బాధ్యుడట. ఈసీ సూచనలను పరిగణనలోకి తీసుకునే సీఎస్ గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చినా ఆయనపైనే ఏడుపుగొట్టు వార్తలు. బ్యాంకుల ద్వారా పెన్షన్ ఇవ్వాలని కోరింది నిమ్మగడ్డ రమేషే కదా! అయినా ఆయన తప్పు లేదట. జనం అందరికి ఇది అర్థం అయినా రామోజీకి ఇంకా తెలియలేదు. వృద్దులంతా చంద్రబాబును, నిమ్మగడ్డను, రామోజీ వంటివారిని బండబూతులు తిట్టిన సంగతి జనానికి తెలియదా! సీఎస్‌నుంచి ఈసీ నివేదిక తెప్పించుకుని అధికారులను నియమించిందట.రామోజీ కొత్త రాజ్యాంగం రాయాలి. ప్రతిపక్ష నేతనో, లేక రామోజీనో నివేదికలు అడగాలి కాబోలు. పెద్ద ఎత్తున హింసాకాండ చెలరేగితే ఛీఫ్ సెక్రటరీని బాధ్యుడిని చేయకపోవడం ఏమిటి? అని ఈనాడు రాసిందంటే వారు జర్నలిజం చేస్తున్నారా? లేక ఇంకేమైనా చేస్తున్నారా? అనే అనుమానం వస్తుంది. ఈసీకి జాబితాలు పంపించి, వారు ఎవరిని నియమించమని చెబితే వారిని అప్పాయింట్ చేస్తే అది కూడా జవహర్ రెడ్డి తప్పేనట. ఈయన ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగవని విపక్షాలు అన్నాయట. అది వేద వ్యాఖ్యమట.ఆయా స్కీములకు కొన్ని నెలలు డబ్బు వేయకుండా, ఎన్నికల ముందు లబ్దిదారులకు ఇచ్చేయత్నం చేశారని అన్నారు. మరి చంద్రబాబు ఎన్నికల ముందు పసుపు-కుంకుమ అని, అన్నదాత సుఖీభవ అని డబ్బులు వేస్తే గొప్ప విషయమని ఇదే ఎల్లో మీడియా ఆ రోజుల్లో ప్రచారం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమయంలో లబ్దిదారులకు డబ్బులు పడకుండా ఆపింది టీడీపీ, ఎల్లో మీడియానే కదా! ఇంక వైఎస్సార్‌సీపీకి వచ్చిన లాభం ఏముంది. చివరిగా వీరి అసలు బాధ బయటపెట్టేశారు. ఏపీ ప్రభుత్వం వివిధ ఆరోపణలపై సస్పెండ్ చేసిన ఏబీ వెంకటేశ్వరరావుకు వెంటనే పోస్టింగ్ ఇవ్వలేదట. అదట వీరి కడుపు నొప్పికి కారణం. ఈయనేమో టీడీపీ ఆఫీస్‌లో కూర్చుని పోలీసు అదికారులను ప్రభావితం చేయడానికి కృషి చేశారని వైఎస్సార్‌సీపీ ఆరోపించింది. అయినా పోస్టింగ్ ఎందుకు ఇవ్వలేదని ఈనాడు గొడవ చేస్తోంది. దీనిని బట్టే వారి మధ్య ఎలాంటి సంబంధ, బాంధవ్యాలు ఉన్నాయో గమనించవచ్చు.ఆంధ్రజ్యోతి అయితే హీనంగా మరో అబద్దపు కథనాన్ని ప్రచారం చేసింది. నీతి అయోగ్ లాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి తమకు తెలియదని అన్నదట. ఎన్నికల సమయంలో అబద్ధాలు ప్రచారం చేశారంటే ఓట్ల కోసం అని అనుకోవచ్చు. ఇప్పుడు కూడా అదే రకంగా అబద్ధాలు చెబుతున్నారంటే వారికి బుద్ది, జ్ఞానం లేదని అనుకోవాలి. నీతి అయోగ్ ముసాయిదా పంపించామని తెలిపినా వీరు ఒప్పుకోరన్నమాట. ఎన్నికలు అయిపోయాక కూడా ఈనాడు, ఆంధ్రజ్యోతి తెగబడి ఇలాంటి అసత్య కథనాలు ఇవ్వడం ద్వారా సాధించేది ఏమిటో తెలియదు! అంటే ఎన్నికలలో గెలవడం కష్టమనే అభిప్రాయానికి ఎల్లో మీడియా వచ్చేసిందా? అందుకే అప్పుడే మళ్లీ దాడి ఆరంభించిందా!– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్‌ పాత్రికేయులు

No Conspiracy In Iran President Helicopter Crash: US
‘రైసీ’ మృతి కేవలం ప్రమాదమే: అమెరికా

వాషింగ్టన్‌: ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం వెనుక మరొకరి పాత్ర లేదని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మాధ్యూ మిల్లర్‌ స్పష్టం చేశారు. 45 ఏళ్ల నాటి హెలికాప్టర్‌ను ఉపయోగించాలనుకోవడం.. అది కూడా వాతావరణం సరిగా లేని సమయంలో ప్రయాణించడం వల్లే ప్రమాదం జరిగిందని తెలిపారు. అంతకుముందు ఇరాన్‌ విదేశాంగ శాఖ మాజీ మంత్రి జావెద్‌ మాట్లాడుతూ హెలికాప్టర్‌ విడిభాగాల సరఫరాపై అమెరికా విధించిన ఆంక్షల వల్లే తమ అధ్యక్షుడు మరణించారన్నారు. కాగా, రైసీ మృతికి కారణమైన బెల్‌ 212 హెలికాప్టర్‌లో సిగ్నల్‌ వ్యవస్థ ప్రధాన లోపంగా కనిపిస్తున్నట్లు టర్కీ రవాణశాఖ మంత్రి అబ్దుల్‌ ఖదీర్‌ తెలిపారు. హెలికాప్టర్‌లో సిగ్నల్‌ వ్యవస్థ పని చేయడం లేదని, అసలు సిగ్నల్‌ వ్యవస్థ ఉందో లేదో కూడా తెలియదన్నారు. హెలికాప్టర్‌ సిగ్నల్‌ కోసం తాము తొలుత ప్రయత్నించినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. వీవీఐపీలు ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌లలో సిగ్నల్‌ వ్యవస్థ ఉండి తీరాలని ఖదీర్‌ అన్నారు.

12-Year-Old Girl Develops Hole In Stomach After Consuming Smoke Paan At Wedding
స్మోక్‌ పాన్: 12 ఏళ్ల బాలిక దుస్థితి తెలిస్తే జన్మలో దాని జోలికెళ్లరు

ఈ మధ్యంకాలంలో పెళ్లిళ్లు, పార్టీలలో ఎక్కడ చూసినా స్మోక్‌ పాన్‌, స్మోక్‌ చాకెట్ల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా 'స్మోక్‌ పాన్' తిన్న తర్వాత నోట్లోంచి పొగలు రావడంపై జనాలకు బాగా క్రేజ్‌ పెరిగింది. వాస్తవానికి ఈ స్మోక్‌ పాన్ ఒక రకమైన హానికరమైన రసాయన నైట్రోజన్ సహాయంతో తయారు చేస్తారు. అందుకే నైట్రోజన్‌ పాన్‌అని కూడా అంటారు. తాజాగా ఇలాంటి స్మోకీ పాన్ తిని ప్రాణాలకు మీదకి తెచ్చుకున్న ఉదంతం కలకలం రూపింది.టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం భారతదేశంలోని బెంగళూరు నగరానికి చెందిన 12 ఏళ్ల బాలిక లిక్విడ్ నైట్రోజన్‌తో కూడిన 'స్మోకీ పాన్'ని తిని తీవ్ర అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరింది. పెర్ఫోరేటెడ్ పెరిటోనిటిస్ (కడుపులో రంధ్రం) వ్యాధి బారిన బాలిక పడినట్లు పరీక్షల్లో తేలింది. దీంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఆరు రోజుల తర్వాత చికిత్స తరువాత ఇంటికి చేరింది.స్మోక్‌ పాన్‌ ప్రమాదమా?నైట్రోజన్ అనే వాయువును లిక్విడ్‌ రూపం 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయబడుతుంది. ఈ ద్రవ నత్రజని వేగంగా ఆవిరై, పొగలు వస్తాయి. ఇది చూడ్డానికి ఆకర్షణీయంగా కనిపించినా ఆరోగ్యానికి హానికరమని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆవిరిని పీల్చడం వల్ల శ్వాస తీసు కోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. ప్యాక్ చేసిన ఆహారం నాణ్యత, షెల్ఫ్ జీవితాన్ని పెంచడానికి ద్రవ నైట్రోజన్‌ను వాడతారు.

Severe Turbulence on Singapore Airlines Flight From London One Dead
సింగపూర్ ఎయిర్‌లైన్స్ విమానంలో కుదుపులు.. ఒకరు మృతి

సరైన రోడ్డు మార్గాలు లేకపోవడం వల్ల బస్సులు కుదుపులకు గురవుతాయి. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ ఘటనలో విమానం తీవ్ర కుదుపులకు గురైంది. వినటానికి వింతగా ఉన్నా ఇది నిజం. దీనిని సింగపూర్ ఎయిర్‌లైన్స్ కూడా ధ్రువీకరించింది.సోమవారం లండన్‌లోని హీత్రూ విమానాశ్రయం నుంచి సింగపూర్‌కు బయలుదేరిన SQ321 విమానం మార్గమధ్యంలో తీవ్రమైన అల్లకల్లోలాన్ని ఎదుర్కొందని.. సింగపూర్ ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతో విమానం బ్యాంకాక్‌లోని సువర్ణభూమి అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు (స్థానిక కాలమానం ప్రకారం) ల్యాండ్ అయింది.బోయింగ్ 777-300 ER విమానంలో మొత్తం 211 మంది ప్రయాణికులతో పాటు 18 మంది సిబ్బంది ఉన్నారు. ఇందులో 30 మంది గాయపడగా, ఒకరు మృతి చెందారు. ఈ విషయాన్ని సింగపూర్ ఎయిర్‌లైన్స్ ధ్రువీకరిస్తూ.. మరణించిన వ్యక్తి కుటుంబానికి సంతాపాన్ని తెలియజేసింది.విమానం ల్యాండ్ అయిన తరువాత అవసరమైన వైద్య సహాయం అందించడానికి థాయ్‌లాండ్‌లోని స్థానిక అధికారులతో కలిసి పని పనిచేస్తున్నట్లు.. ఇంకా అదనపు సహాయాన్ని అందించడానికి బ్యాంకాక్‌కు ఒక బృందాన్ని పంపినట్లు సింగపూర్ ఎయిర్‌లైన్స్ పేర్కొంది.ప్రయాణికులు సీటు బెల్ట్ ధరించనప్పుడు ఇటువంటి గాయాలు సాధారణంగా జరుగుతాయని నిపుణులు తెలిపారు. వాతావరణ రాడార్ నుంచి ముందస్తు సమాచారం అందకపోవడంతో పైలెట్ కూడా ముందుగా ప్రయాణికులను హెచ్చరికను ఇవ్వలేకపోయారని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రయాణికులు సీటు బెల్టు ధరించకపోవడం వల్ల.. వారు కాక్‌పిట్‌లోకి పడే అవకాశం ఉంటుంది. అలంటి సమయంలో ఊహకందని ప్రమాదం జరుగుతుంది.Singapore Airlines flight #SQ321, operating from London (Heathrow) to Singapore on 20 May 2024, encountered severe turbulence en-route. The aircraft diverted to Bangkok and landed at 1545hrs local time on 21 May 2024.We can confirm that there are injuries and one fatality on…— Singapore Airlines (@SingaporeAir) May 21, 2024

Is SRH Into IPL 2024 Final Cummins Post Goes Viral Ahead Of Qualifiers
SRH Vs KKR: ఫైనల్‌ చేరడమే మిగిలింది: కమిన్స్‌ పోస్ట్‌ వైరల్‌

ఐపీఎల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంచలన ఆట తీరుతో ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌ చరిత్రలో అత్యధిక స్కోరు(287) నమోదు చేసిన జట్టుగా చరిత్ర సృష్టించింది. గత మూడేళ్లుగా పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం కోసం పోటీ పడ్డ దుస్థితి నుంచి.. ఈసారి ఏకంగా ఫైనల్‌ రేసులో నిలిచే స్థాయికి చేరుకుంది. కనీసం ప్లే ఆఫ్స్‌ చేరినా చాలంటూ ఆరెంజ్‌ ఆర్మీ అభిమానులు ఎదురుచూస్తున్న వేళ.. విధ్వంసకర ఆట తీరుతో ఏకంగా క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించింది. ఇంకొక్క ఆటంకం దాటితే చాలు.. ఐపీఎల్‌ పదిహేడో ఎడిషన్‌లో ఫైనల్‌ చేరిన తొలి జట్టుగా అర్హత సాధించే అవకాశం ముంగిట నిలిచింది. ప్రధాన కారణాలు ఇవేఇక ఈ సీజన్‌లో సన్‌రైజర్స్‌ అద్భుత విజయాలకు ప్రధాన కారణం విధ్వంసకర బ్యాటింగ్‌తో పాటు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ వ్యూహాలు, కోచ్‌ డానియల్‌ వెటోరీ ప్రణాళికలు అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా సారథిగా కమిన్స్‌ జట్టును గెలుపు బాట పట్టించడంలో పూర్తిగా విజయవంతమయ్యాడు.ప్రత్యర్థి జట్ల వ్యూహాలను చిత్తు చేస్తూ మైదానంలో ఎప్పటికప్పుడు సరికొత్త ప్రణాళికలతో ముందుకు సాగి సన్‌రైజర్స్‌ విన్‌రైజర్స్‌గా మార్చడంలో సఫలమయ్యాడు ఈ పేస్‌ బౌలర్‌. ఒత్తిడి నెలకొన్న సమయాల్లోనూ ఏమాత్రం సహనం కోల్పోకుండా ఆటగాళ్లకు అండగా నిలుస్తూ ఫలితాలు రాబడుతున్నాడు. ఫ్రాంఛైజీ తన కోసం ఖర్చు పెట్టిన రూ. 20.50 కోట్లకు పూర్తి న్యాయం చేస్తూ పైసా వసూల్‌ ప్రదర్శన ఇస్తున్నాడు.మరో అవకాశం కూడా ఉందిఇక కమిన్స్‌ సారథ్యంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న సన్‌రైజర్స్‌ క్వాలిఫయర్‌-1లోనూ ఇదే జోష్‌ కనబరిస్తే.. టైటిల్‌కు కేవలం ఒక్క అడుగు దూరంలో నిలుస్తుంది.ఒకవేళ కేకేఆర్‌తో ఈ మ్యాచ్‌లో ఓడినా క్వాలిఫయర్‌-2 రూపంలో కమిన్స్‌ బృందానికి మరో అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఎలా చూసినా ఈసారి సన్‌రైజర్స్‌కు ఫైనల్‌ చేరేందుకు సానుకూలతలే ఎక్కువగా కనిపిస్తున్నాయంటూ ఆరెంజ్‌ ఆర్మీ ఫ్యాన్స్‌ నెట్టింట సందడి చేస్తున్నారు.ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయిఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఇన్‌స్టా పోస్ట్‌ వైరల్‌గా మారింది. కాగా సొంతమైదానం ఉప్పల్‌లో సన్‌రైజర్స్‌ ఆదివారం.. ఈ సీజన్‌ లీగ్‌ దశలో తమ ఆఖరి మ్యాచ్‌ ఆడింది. పంజాబ్‌ కింగ్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొంది పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది.అనంతరం కేకేఆర్‌- రాజస్తాన్‌ రాయల్స్‌ మధ్య మ్యాచ్‌ రద్దు కావడంతో రెండో స్థానాన్ని మరింత పదిలం చేసుకుని క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో కమిన్స్‌ స్పందిస్తూ.. ‘‘ఉప్పల్‌లో మరో అద్భుతమైన రోజు. మాకు మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. ఇక మనం ఫైనల్స్‌లో అడుగుపెట్టడమే తరువాయి’’ అని అభిమానులను ఉత్సాహపరిచాడు.ఈసారి కచ్చితంగా తుదిపోరుకు అర్హత సాధిస్తామని ఈ సందర్భంగా కమిన్స్‌ ధీమా వ్యక్తం చేశాడు. కాగా కేకేఆర్‌- సన్‌రైజర్స్‌ మధ్య క్వాలిఫయర్‌-1కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక. ఇదే గడ్డపై వన్డే వరల్డ్‌కప్‌-2023 ఫైనల్లో ప్యాట్‌ కమిన్స్‌ సారథ్యంలోని ఆస్ట్రేలియా విజేతగా నిలిచిన విషయం తెలిసిందే.చదవండి: KKR vs SRH: ప్రమాదకారి.. ఫైనల్‌ చేరే తొలి జట్టు ఇదే: పాక్‌ లెజెండ్‌ Locked and loaded for Qualifier 1 🔥💪#PlayWithFire #KKRvSRH pic.twitter.com/nkTpipX0I8— SunRisers Hyderabad (@SunRisers) May 21, 2024

Ap Elections 2024 May 21 Political Updates Telugu
May 21st: ఏపీ పొలిటికల్‌ అప్‌డేట్స్‌

May 21st AP Elections 2024 News Political Updates5:17 PM, May 21st, 2024సోమిరెడ్డికి, టీడీపీ వాళ్లకు సవాల్‌ చేస్తున్నా: మంత్రి కాకాణిబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను రెడీ.. సోమిరెడ్డి సిద్ధంగా ఉన్నారా ?నెల్లూరు లో ఎక్కడికి రావాలో చెప్తే అక్కడికి వస్తాఎవరికి రేవ్ పార్టీకి వెళ్లే అలవాటు ఉందో తెలుస్తుందిఆధారాలు ఉంటే సోమిరెడ్డి పోలీసులకు ఇవ్వాలిబెంగళూరు రేవ్ పార్టీపైసీబీఐ దర్యాప్తుకు నేను సిద్ధంగా ఉన్నాబ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా.. ? పాస్ పోర్ట్ చూపించడానికి వస్తావా ?రేవ్ పార్టీలో చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు ఉన్నారని సోషల్ మీడియాలో వస్తుంది..బెంగళూరు పోలీసులు ఎటువంటి కాల్ చేయలేదురేవ్ పార్టీ జరిగిన ఫార్మ్ హౌస్ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదుపాసు పోర్ట్ నా దగ్గరే ఉందికుట్ర కోణం పై విచారణ చేయాలని పోలీసులను కోరానురోస్ ల్యాండ్ లాడ్జిలో చంద్రమోహన్ రెడ్డి రెడ్ హ్యాండెడ్ గా దొరికారుసోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లోఫర్బెంగళూరు రేవ్ పార్టీ విషయంలో నాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారునాకు సంబంధాలు ఉన్నా.. నాకు సంబధించిన వారు ఎవరు ఉన్నా చర్యలు తీసుకోవాలిఎవడో అనామకుడు నా స్టిక్కర్‌ను జిరాక్స్ తీసి వాడుకున్నారురేవ్ పార్టీలు, రేప్ పార్టీలు చేసే చరిత్ర సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిదిసోమిరెడ్డి లేడీ డాక్టర్ ను ఇబ్బంది పెట్టిన కథనాలు గతంలో పత్రికల్లో వచ్చాయినాపై మూడోసారి కూడా సోమిరెడ్డి ఓడిపోతున్నారు.. ఆ ప్రెస్టేషన్ లో ఏదో మాట్లాడుతున్నారుయూత్ మినిస్టర్ గా ఉండి.. క్రికెట్ కిట్స్ అమ్ముకున్న చరిత్ర సోమిరెడ్డిదినా పాస్ పోర్ట్ నెల్లూరు లో ఉందికారు స్టిక్కర్ జిరాక్స్ చేసి నాపై కుట్ర చేసినట్లు అనుమానాలు ఉన్నాయి.. కర్ణాటక పోలీసులకు ఫిర్యాదు చేశా 5:08 PM, May 21st, 2024మేం గెలుస్తామని...జూన్ 9న ప్రమాణ స్వీకారం అని చెప్పాం: మంత్రి బొత్స సత్యనారాయణఎన్నికలు పూర్తయ్యాయి...భవితవ్యం బ్యాలెట్ బాక్సులలో ఉన్నాయిఏపీలో విద్యావిదానంపై మా విధానాన్ని మ్యానిఫెస్టోలో పెట్టాంప్రతిపక్ష పార్టీలు మా విద్యావిధానం నచ్చకపోతే ఎందుకు వారి విధానాన్ని మేనిఫెస్టోలో పెట్టలేదురాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో 38,61,198 మంది చదువుతుంటే వాస్తవ విరుద్దంగా 35 లక్షలే ఉన్నారని ఇచ్చారుఏపీ విద్యార్ధులు అంతర్జాతీస్ధాయిలో రాణించేలా ఎన్నో‌కీలక మార్పులు తెచ్చాంఇంగ్లీష్ మీడియం, డిజిటల్ విద్య, టోఫెల్,జగనన్న గోరుముద్ద, విద్యాదీవెన, విద్యాకానుక, విదేశీ విద్యాదీవెన‌ ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాంవిద్యావ్యవస్ధపై ఎందుకు తప్పుడు కధనాలు ప్రచురిస్తున్నారుమాపై బురద జల్లుతున్నారువిద్యావ్యవస్ధలో ఇంకా మంచి మార్పులు తీసుకురావాలని మా ఆలోచనమా విధానాలు నచ్చ పెద్ద ఎత్తున‌మాకు అనుకూలంగా ఓటేశారని భావిస్తున్నాంమళ్లీ సీఎంగా వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారునేను ఎన్నో ఎన్నికలు చూశాను కానీ ఇలాంటి పరిస్ధితులు ఎపుడూ చూడలేదుప్రధాన పార్టీ నాయకులంతా ప్రస్తుతం విదేశాలలో ఉన్నారుసీఎం జగన్‌ ఫ్యామిలీతో విదేశాలకి వెళ్లారువాతావరణం అనుకూలించక మద్యలో ఆగితే తప్పుడు ప్రచారాలు ఎందుకు?చంద్రబాబు చెప్పాపెట్టకుండా విదేశాలకి వెళ్లారుచంద్రబాబు ఏ దేశం వెళ్లారో కూడా తెలియదుచంద్రబాబు ఏ దేశం వెళ్లారో చెప్పాలిచంద్రబాబు కంటే ముందే ఆయన కుమారుడు విదేశాలకి వెళ్లారురాష్ట్ర ప్రజలని కోరుతున్నా....సంయమనం పాటించాలని కోరుతున్నాసోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ఆపండిరాష్డ్ర అభివృద్దిలో అందరూ భాగస్వామ్యులమేఎందుకు హర్రీ అండ్ వర్రీచంద్రబాబు ప్రజలకి చెప్పి విదేశాలకి వెళ్తే తప్పేంటి?ఎందుకు చెప్పకుండా చంద్రబాబు విదేశాలకి వెళ్లారుభయంతో చంద్రబాబు విదేశాలకి పారిపోయారా?సిఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనలపై ఎందుకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు?అమెరికాలో నివాసం ఉన్న డాక్టర్ గన్నవరంలో హల్ చల్ చేయడం ఏంటి?సిఎం వైఎస్ జగన్‌ని అడ్డుకోవాలని మెసేజ్‌లు పెట్టడం.. డిబేట్లు ఏంటి?ఈ తరహా కల్చర్ ఎపుడూ లేదుమాకు 175 సీట్లు వస్తాయని అనుకుంటున్నామేనిఫెస్టోని చూసి ఓటేయమని ఏ సీఎం అయినా చెప్పారా?తన పాలన చూసి ఓటేయాలని ప్రధాని మోదీనే అడగలేకపోయారుమీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటు వేయమని జగన్ మాత్రమే అడిగారుసీఎం జగన్‌ రాజకీయాలలో ట్రెండ్ సెట్ చేశారునా తప్పులని దిద్దుకుంటానని అధికారంలోకి వచ్చి మళ్లీ చంద్రబాబు మోసం చేశారురైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని మోసం చేయలేదాచంద్రబాబుకి క్రెడిబిలిటీ లేదుదేశంలోనే ఎక్కడా లేని విధంగా వైద్యం, విద్యా రంగాల్లో సంస్కరణలు అమలు చేశాంమా సంస్కరణలతో ఏపీ జీడీపీ పెరిగిందిగ్రామాలలో వృద్దులకి, మహిళలకి ఎంతో గౌరవం పెరగడానికి మా సంక్షేమ పథకాలే కారణంవాలంటీర్, సచివాలయ వ్యవస్ధలతో క్షేత్రస్ధాయిలోకి వెళ్లే వ్యవస్ధ దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేదుకరోనా సమయంలో అలాంటి వ్యవస్ధతో సమర్దవంతంగా ఎదుర్కొన్నాంప్రజలకి కావాల్సిన విధానాలని...సంస్కరణలనే సిఎం వైఎస్‌ జగన్‌ అమలు చేశారుఅందుకే సీఎం జగన్‌కి మళ్లీ పట్టం కట్టారని భావిస్తున్నాంప్రశాంత్ కిషోర్ ఏమైనా బ్రహ్మానా...ఎన్ని సీట్లు వస్తాయో చెప్పడానికిఆ రోజు భ్రమలలో ఉండి ప్రశాంత్ కిషోర్‌ని తీసుకొచ్చాంసిఎం వైఎస్ జగన్ పర్మినెంట్‌గా ఉండే విధానాలనే నమ్ముతారుప్రశాంత్ కిషోర్ కమర్షియల్ అని తెలుసుకునే వద్దనుకున్నాం2:32 PM, May 21st, 2024ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికెళ్లారు?: మంత్రి జోగి రమేష్‌దోచినడబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లారా?చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్‌ గల్లంతుటీడీపీ నాయకులు నోటికి తాళాలు పడ్డాయి.కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారుఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయిచంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయంచంద్రబాబు వ్యవస్థలను భ్రష్టు పట్టించారువైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలిపల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే2:24 PM, May 21st, 2024ఈనాడు వార్తలను ఖండించిన సీఎస్‌డీఎస్‌ఏపీలో మేం పోస్ట్‌ పోల్‌ సర్వే నిర్వహించాంమా సర్వే రిపోర్ట్‌ నాలుగు రోజుల్లో వస్తుందిటీడీపీకే జనం అనుకూలంగా ఉన్నారనే వార్త అవాస్తవంసెఫాలజిస్ట్‌ సంజయ్‌కుమార్‌ మాటలు కూడా నిరాధారమే: సీఎస్‌డీఎస్‌ ఏపీ కోఆర్డినేటర్‌ వెంకటేష్‌2:01 PM, May 21st, 2024జూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు: ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిమాచర్ల టీడీపీ అభ్యర్థి బ్రహ్మరెడ్డిపై మండి పడ్డ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పిన్నెల్లిజూలకంటి బ్రహ్మరెడ్డి చరిత్ర మర్డర్లు చేసే చరిత్రఅభివృద్ది చేసే చరిత్ర మాదిసిట్టింగ్ జడ్జితో విచారణకు నేను కూడా సిద్దంఏడు మర్డర్ల కేసులో ఏ1 ముద్దాయి జూలకంటి బ్రహ్మారెడ్డిజూలకంటి బ్రహ్మారెడ్డి దుర్మార్గుడు 2009లో నాపై ఓడిపోయి మాచర్ల నుంచి పారిపోయాడువైఎస్సార్‌సీపీ పాలనలో మాచర్ల నియోజకవర్గం అభివృద్ధినీతి కబుర్లు చెబుతూ షో చేస్తూ చందాల మీద బతికే వ్యక్తి జూలకంటి బ్రహ్మారెడ్డి11:32 AM, May 21st, 2024ఎస్సీలంతా వైఎస్సార్సీపీకే ఓటు వేశారు: మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు నత్తా యోనారాజుఆ అక్కసుతోనే దళితులపై దాడులు జరిపారువదినా మరిది అయిన పురందేశ్వరి, చంద్రబాబు పోలీసులను మార్చారుపోలీసు అధికారులు మారిన చోటే ప్లాన్ ప్రకారం దాడులు జరిపారుఎలక్షన్ కమిషన్ కిందే వ్యవస్థలు పని చేస్తున్నాయిచంద్రబాబు తన మనమడికి 6 నెలల వయసున్నపుడే వందలకోట్లు జమ చేశాడుపాలన ద్వారా జగన్ పేదల పాలిట దైవంగా మారారుసీఎం జగన్‌ను ఓడించే దమ్ము, ధైర్యం టీడీపీకి లేవుపేదలకు జరిగే లబ్ధిని చూసి ఓర్వలేకే దాడులు జరిపారుపేదల పిల్లలు ఐక్య రాజ్య సమితికి వెళ్లి మాట్లాడుతున్నారుఎస్సీల్లో ఎవరు పుట్టాలని కోరుకుంటారని ప్రశ్నించిన వ్యక్తి చంద్రబాబుబీసీల తోకలు కత్తిరిస్తానంటూ మాట్లాడిన వ్యక్తి చంద్రబాబుబీజేపీతో కలిసి చంద్రబాబు రాష్ట్రాన్ని మరో మణిపూర్ చేయాలని చూస్తున్నారుఎస్సీలంతా జగన్ వైపే ఉన్నారు10:43 AM, May 21st, 2024కేంద్ర ఎన్నికల సంఘానికి చేరిన సిట్ నివేదిక150 పేజీల ప్రాథమిక నివేదికను సీఈసీకి పంపిన ఏపీ సీఎస్ఏపీలో ఎన్నికల రోజు, తర్వాత హింసపై సిట్ ప్రాథమిక నివేదికపల్నాడు, తిరుపతి, అనంతపురం జిల్లాల్లో.. మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగినట్లు గుర్తించిన సిట్1370 మందిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు, 124 మంది అరెస్ట్ఇంకా 1152 మందిని అరెస్ట్ చేయాల్సి ఉందని సిట్ నివేదికఎఫ్‌ఐఆర్‌లో కొత్త సెక్షన్ల చేర్చే విషయంపై సిఫార్సు చేసిన సిట్8:40 AM, May 21st, 2024దుష్ప్రచారం చేయడం డాక్టర్‌ లోకేశ్‌కు అలవాటే: ప్రముఖ ఎన్‌ఆర్‌ఐ డాక్టర్‌ వాసుదేవరెడ్డి వెల్లడికోర్టుల్లో తప్పుడు కేసులు వేయడంలో నేర్పరి చీవాట్లు పెట్టి జరిమానా విధించిన అమెరికా కోర్టుపలువురు రోగుల మరణానికి కారకుడయ్యాడని ప్రాక్టీస్‌ పైనా నిషేధంఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధా­విగా చలామణి అవుతున్నారుఅయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్‌పై నిషేధం కొనసాగుతోందిగుంటూరు మెడికల్‌ కాలేజీలో 1983లో లోకేశ్‌ గ్రాడ్యుయేట్‌ అయ్యాడుగ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్‌ మొదలెట్టాడుఅప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్‌ చేయడం లోకేశ్‌కు అలవాటుప్రాక్టీస్‌ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజ­­మాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడుఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్‌ జగన్, అదానీ మీద వాషింగ్టన్‌ డీసీ కోర్టులో కేసులు ఫైల్‌ చేశాడుఇండియా నుంచి కంటై­నర్‌లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్‌ నుంచి స్పైవేర్‌ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరో­పణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్‌కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించిందివైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్‌ కారకుడయ్యాడు2006లో వర్జీనియా బోర్డ్‌ ఆఫ్‌ మెడిసిన్‌ లోకేశ్‌ మెడికల్‌ లైసెన్స్‌ను రద్దు చేసిందిఅనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్‌ను రీవోక్‌ చేశారుఅయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్‌పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలిమేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్‌ వంటి కులోన్మాదులు సీఎం జగన్‌పై దాడులకు పాల్పడుతున్నారు.7:52 AM, May 21st, 2024సిట్ నివేదికలో సంచలన విషయాలుఎన్నికల తర్వాత హింసాత్మక ఘటనలపై డీజీపీకి ఇచ్చిన సిట్ నివేదికలో సంచలన విషయాలు150 పేజీల ప్రాథమిక నివేదికను డీజీపీకి అందజేసిన సిట్ ఛీఫ్ వినీత్ బ్రిజ్ లాల్సిట్ ప్రాథమిక నివేదికలో బయటపడిన పోలీసుల వైఫల్యాలుపల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలలో హింసాత్మక ఘటనలపై సిట్ దర్యాప్తునాలుగు బృందాలుగా మూడు జిల్లాలలో పర్యటించిన సిట్33 ఘటనలలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్‌లు, సీసీ కెమెరాలు పరిశీలనఈ అల్లర్లలో 1370 మంది నిందితులకి 124 మందినే అరెస్ట్ చేసిన పోలీసులుఇందులో 639 మంది నిందితులని ఇంకా గుర్తించాల్సి ఉందన్న సిట్1100 మందిని ఇంకా అరెస్ట్ చేయకపోవడంలో పోలీసుల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించిన‌ సిట్దర్యాప్తులో పోలీస్ శాఖ వైఫల్యాలు ఉన్నట్లు గుర్తించిన సిట్రాళ్ల దాడిని తీవ్రంగా పరిగణించిన సిట్రెండు గ్రూపుల‌ మధ్య రాళ్ల దాడులు మరణాలకి కారణమయ్యాయని పేర్కొన్న సిట్ప్లీ ప్లాన్డ్‌గానే రాళ్లు, కర్రలతో దాడి జరిగినట్లు గుర్తింపుదాడులను ముందస్తుగా ఊహించడంలో అధికారులు విఫలమయ్యారని సిట్ నివేదికఎన్నికలకి ముందు పోలీస్ అధికారుల బదిలీలే ఘటనలకి కారణంగా సిట్ నివేదికపరారీలో ఉన్న వారిని త్వరితగతిన అరెస్ట్ చేయాలని సిట్ సూచనకోర్టులో మెమో దాఖలు చేసి అదనపు సెక్ష‌న్లు జోడించాలన్న సిట్సిట్ నివేదిక ఆధారంగా వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్పీలు, అనంతపురం డీఐజీ, గుంటూరు రేంజ్ ఐజీలను ఆదేశించిన డీజీపీ7:16 AM, May 21st, 2024ఇట్లు.. ఇటలీకి!వైద్య పరీక్షల కోసం అమెరికా వెళ్తున్నట్లు చంద్రబాబు లీకులుఅబ్బే.. ఇటు రాలేదన్న టీడీపీ ఎన్నారై విభాగం నేతటీడీపీ అధినేత ఇటలీలో ప్రత్యక్షమైనట్లు సమాచారంగతంలో విదేశాల నుంచే షెల్‌ కంపెనీలకు అక్రమ నిధుల మళ్లింపుస్కిల్‌ స్కామ్‌లోనూ బాబు దుబాయ్‌ బంధంఈసారి అదే షెల్‌ దందాయేనా..!గోప్యంగా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు అదే 7:07 AM, May 21st, 2024కుమ్మక్కుతో విధ్వంసకాండకాల్‌ డేటా విశ్లేషించి కఠిన చర్యలు తీసుకోవాలిసిట్‌ను కోరిన వైఎస్సార్‌సీపీ నేతలుకొందరు పోలీసు అధికారులు టీడీపీతో కుమ్మక్కై విధ్వంస కాండకు కొమ్ము కాశారుటీడీపీ రౌడీమూకల విధ్వంసకాండపై పారదర్శకంగా విచారణ నిర్వహించి దోషులను కఠినంగా శిక్షించాలిదాడులు జరిగిన ప్రాంతాల్లో ఎస్సైలు, సీఐల కాల్‌ డేటా సేకరించి విచారణ నిర్వహించాలి 7:05 AM, May 21st, 2024పల్నాడులో మహిళలపై ఇంతటి దాడులా?మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ గజ్జల వెంకటలక్ష్మి ఆగ్రహంనిందితులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్, ఎస్పీలకు లేఖరాజకీయాల్లో ఎన్నడూ లేనివిధంగా తమకు ఓట్లు వేయలేదనే కక్షతో ఎస్సీ, బీసీ మహిళలపై దాడులకు దిగడం దారుణంఎస్సీ, బీసీ మహిళలనే టార్గెట్‌గా చేసుకుని ఇంతలా దాడులు చేయడం దుర్మార్గం6:53 AM, May 21st, 2024బదిలీలతో బరితెగింపుఎన్నికల సందర్భంగా జరిగిన హింసపై డీజీపీకి సిట్‌ నివేదికదాడులు అరికట్టడం, కేసుల దర్యాప్తులో పోలీసులు విఫలంపోలింగ్‌కు ముందు ఆకస్మిక బదిలీలతో యథేచ్చగా విధ్వంసకాండదర్యాప్తు సక్రమంగా లేదు.. అదనపు సెక్షన్లు చేర్చాలి

Tollywood actress Hema Released Another Video In Social Media
బెంగళూరు రేవ్ పార్టీ.. మరో వీడియో రిలీజ్!

బెంగళూరు రేవ్ పార్టీ టాలీవుడ్‌ను కుదిపేస్తోంది. ఈ పార్టీకి టాలీవుడ్ ప్రముఖులు హాజరయ్యారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఇండస్ట్రీలో హాట్‌ టాపిక్‌గా మారింది. దీంతో తాము పార్టీకి వెళ్లలేదంటూ నటి హేమ, హీరో శ్రీకాంత్‌ వీడియోలను రిలీజ్ చేశారు. తాము హైదరాబాద్‌లోనే ఉన్నామంటూ క్లారిటీ ఇచ్చారు. కన్నడ మీడియాలో, సోషల్‌ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. అనవసరంగా తన పేరును లాగొద్దని విజ్ఞప్తి చేశారు.అయితే ఇదిలా ఉండగా.. హేమ తాజాగా మరో వీడియోను రిలీజ్‌ చేశారు. తన ఇంట్లోనే బిర్యానీ వండుతున్న వీడియోను పంచుకున్నారు. దీంతో హేమ చేసిన వీడియో మరోసారి సోషల్ మీడియాలో హాట్‌ టాపిక్‌గా మారింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని చెప్పేందుకు బిర్యానీ రెసీపీ చేస్తున్న వీడియోను రిలీజ్ చేసినట్లు తెలుస్తోంది. అసలేం జరిగిందంటే..బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ‌ సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రేవ్‌ పార్టీ జరిగింది. ‌బర్త్‌డే పార్టీ పేరుతో జీఆర్‌ ఫామ్‌హౌస్‌లో జరిగిన ఈ రేవ్‌ పార్టీపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ పార్టీలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌, కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు బెంగళూరు పోలీసులు వెల్లడించారు. ఈ రేవ్‌ పార్టీలో టాలీవుడ్‌కు చెందిన ప్రముఖ సెలబ్రిటీలు సైతం ఉన్నట్లు పెద్దఎత్తున సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. View this post on Instagram A post shared by KOLLA HEMA (@hemakolla1211)

Telangana Stood second Rank In country stolen, lost mobile with CEIR portal
సెల్‌ఫోన్స్‌ రికవరీలో రెండో స్థానంలో తెలంగాణ

సాక్షి, హైదరాబాద్‌: చోరికి గురైన లేదా పొరపాటున పోగొట్టున్న సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీసులు అరుదైన ఘనత సాధించారు. సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌(సీఈఐఆర్‌) పోర్టల్‌, లోకల్‌ ట్రాకింగ్‌ ద్వారా ఫోన్లను ట్రేస్‌ చేసి, వాటిని యజమానులకు అప్పగించడంలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. గతేడాది ఏప్రిల్‌ 19 నుంచి ఇప్పటి వరకు పోలీసులు రోజుల్లో 30,049 ఫోన్లు రికవరీ చేసినట్లు సీఐడీ అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు.హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869, సైబరాబాద్‌ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 ఠాణాల్లో సీఈఐఆర్‌ యూనిట్లు ఉన్నాయన్నారు. గడిచిన 9 రోజుల్లో వెయ్యి ఫోన్లు రికవరీ చేశామన్నారు.35,945 సెల్‌ఫోన్స్‌ రివకరీలతో కర్నాటక రాష్ట్రం మొదటి స్థానంలో ఉండగా.. 7387 సెల్‌ఫోన్స్‌ రికవరీల్లో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. ఫోన్ దొంగతనం లేదా కనిపించకుండా పోయిన వెంటనే సీఈఐఆర్‌ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ పోర్టల్‌లో ఒకసారి నమోదు చేసుకుంటే ఫోన్లో ట్రాకింగ్ ఈజీ అవుతుందని పేర్కొన్నారు.

Jogi ramesh Questions On Chandrababu Secret Tour
ఎల్లో మీడియాకు చెప్పకుండా బాబు ఎక్కడికి వెళ్లారు? జోగి రమేష్‌

సాక్షి, విజయవాడ: ఎల్లో మీడియాకు చెప్పకుండా చంద్రబాబు ఎక్కడికి వెళ్లారని మంత్రి జోగి రమేష్‌ ప్రశ్నించారు. చంద్రబాబు కనిపించకుండా పోతే టీడీపీ అడ్రస్‌ గల్లంతవుతుందని అన్నారు. దోచిన డబ్బంతా దుబాయ్‌లో దాచడానికి వెళ్లరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పరార్‌తో టీడీపీ నాయకుల నోటికి తాళాలు పడ్డాయని విమర్శించారు. కూటమి పేరుతో చంద్రబాబు కుట్రలు చేశారన్నారు జోగి రమేష్‌. ఎస్పీలను, కలెక్టర్లను మార్చిన చోటే గొడవలు జరిగాయని మండిపడ్డారు. చంద్రబాబు ఎన్ని విధ్వంసాలు సృష్టించినా.. ప్రజాస్వామ్యంలో వైఎస్సార్‌సీపీ గెలుపు ఖాయమని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలంతా సంబరాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.చంద్రబాబు వ్యవస్థలను భ్రష్టుపట్టించారని మండిపడ్డారు జోగి రమేష్‌. పల్నాడులో అల్లర్లకు కారణం చంద్రబాబే కారణమని దుయ్యబట్టారు. టీడీపీ అడ్రస్‌ గల్లంతు కాబోతుంది కాబట్టే చంద్రబాబు విధ్వంసానికి పాల్పడ్డాడని విమర్శించారు. పురందేశ్వరి ఈసీకి తప్పుడు సమాచారం ఇవ్వడం వల్లే అధికారులను మార్చారనిన్నారు.కాగా అడుగు తీసి అడుగేస్తే మీడియాలో ప్రచారం కోరుకునే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గప్‌చుప్‌గా విదేశాలకు ఉడాయించారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి దుబాయ్‌ వెళ్లిన చంద్ర­బాబు అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారనే విషయంపై గోప్యంగా వ్యవహరిస్తున్నారు. వైద్య పరీక్షల కోసం ఆయన అమెరికా వెళ్లినట్లు టీడీపీ తొలుత మీడియాకు లీకులిచ్చింది.అయితే చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్నారై విభాగం నేత కోమటి జయరాం మాత్రం ఆయన అసలు అమెరికా రాలేదని ప్రకటించడం గమనార్హం. విదేశాల నుంచి అక్రమ నిధులను భారత్‌లోని షెల్‌ కంపెనీలకు మళ్లించిన చరిత్ర ఉన్న చంద్రబాబు ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారు? ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది. గుట్టుచప్పుడు కాకుండా విదేశీ పర్యటన వెనుక లోగుట్టు ఏమిటన్నది సస్పెన్స్‌గా మారింది. అయితే తాజా విశ్వసనీయ సమాచారం ప్రకారం చంద్రబాబు ఇటలీలో ల్యాండ్‌ అయినట్లు తెలుస్తోంది.చదవండి: ఇట్లు ఇటలీకి

తప్పక చదవండి

Advertisement
Advertisement


Advertisement
Advertisement
Advertisement
 

న్యూస్ పాడ్‌కాస్ట్‌

ఫోటో స్టోరీస్

View all
Advertisement