స్పిన్నర్ వేసిన బంతికి వికెట్ విరిగింది | Sakshi
Sakshi News home page

స్పిన్నర్ వేసిన బంతికి వికెట్ విరిగింది

Published Fri, Nov 17 2017 2:04 PM

సాధారణంగా ఫాస్ట్ బౌలర్ వేసిన బంతికి బ్యాట్ ముక్కలవడం కానీ, వికెట్ విరిగి పడటం కానీ చూస్తూ ఉంటాం. అయితే ఒక స్పిన్నర్ వేసిన బంతికి వికెట్ విరిగి ముక్కలవడం మాత్రం చాలా అరుదనే చెప్పాలి. ఈ తరహాలో స్పిన్నర్ బౌలింగ్ లో వికెట్ సగానికి విరిగిన ఘటన బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ లో చోటు చేసుకుంది. బంగ్లా స్సిన్నర్ రషీద్ ఖాన్ వేసిన ఓ బంతి బ్యాట్స్ మన్ వెనుక ఉన్న మిడిల్ స్టంప్ ను బలంగా తాకింది. దీంతో ఆ వికెట్ ముక్కలైంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది.

Advertisement
Advertisement