ఆఫ్రిది బౌండరీ లైన్‌‌లో స్టన్నింగ్‌ క్యాచ్‌ | Sakshi
Sakshi News home page

ఆఫ్రిది బౌండరీ లైన్‌‌లో స్టన్నింగ్‌ క్యాచ్‌

Published Sat, Feb 24 2018 11:47 AM

అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌ బై చెప్పి దాదాపు రెండేళ్లు అయినప్పటికీ తనలో సత్తా తగ్గలేదని ఇప్పటికే పలుమార్లు నిరూపించుకున్న పాకిస్తాన్‌ క్రికెటర్‌ షాహిద్‌ ఆఫ్రిది.. తాజాగా అభిమానుల్ని మరోసారి అబ్బురపరిచాడు. పాకిస్థాన్ సూపర్ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో భాగంగా కరాచీ కింగ్స్‌ తరపున ఆడుతున్న బరిలో దిగిన కళ్లు చెదిరే క్యాచ్‌ను అందుకున్నాడు. దుబాయ్‌లో క్వెట్టా గ్లేడియేటర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆఫ్రిది ఫీల్డింగ్‌లో మ్యాజిక్‌ చేశాడు. 150 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన క్వెట్టా 70 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.