ఈ ఆట మీలో ఎంతమంది ఆడేవాళ్లు? | Sakshi
Sakshi News home page

ఈ ఆట మీలో ఎంతమంది ఆడేవాళ్లు?

Published Sat, Jun 20 2020 7:52 PM

గడిచిన కాలం ఎప్పుడూ అందంగానే ఉంటుంది. ప్రతి సందర్భంలోనూ ఒకప్పటి రోజులే బాగుండేవి అని అనుకుంటూ ఉంటాం. కొన్ని విషయాలు మనకు బాల్యాన్ని గుర్తు చేస్తాయి. వాటిని చూసి చిన్నప్పుడు మనం కూడా అలాగే చేసేవాళ్లం. అచ్చం ఇలాగే ఆడుకునేవాళ్లం అంటూ పాతరోజులను నెమరేసుకుంటాం. ఇంతకీ ఇప్పుడిదంతా ఎందుకు చెప్తున్నానంటే ఓ బామ్మ తన మనవరాలితో కలిసి ‘కచ్చకాయలు’ ఆడుకుంటున్న వీడియో నెటిజన్లకు తమ చిన్ననాటి జ్ఙాపకాలను గుర్తు చేస్తోంది. 

పిల్లలు తమ అమ్మమ్మ, తాతయ్యలతో ఎందుకు సమయం గడపాలి అంటే’ అంటూ ఓ వ్యక్తి షేర్‌ చేసిన ఈ వీడియోలో 60 ఏళ్ల వయసున్న బామ్మ తన మనవరాలతో కూర్చొని సరాదాగా కచ్చ​కాయలు/అచ్చన్న గిల్లలు ఆడుతోంది. ఆటను ఏకదాటిగా బామ్మ ఆడటాన్ని చూస్తున్న తన చిన్నారి మనవరాలు ఎంజాయ్‌ చేస్తుంది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కోడుతున్న ఈ వీడియోను శుక్రవారం ట్విటర్‌లో పోస్ట్‌ చేయగా ఇప్పటికే 15 వేలమంది లైక్‌ చేశారు. అనేక మంది వారి అనుభవాలు, బాల్యానికి సంబంధించిన జ్ఞాపకాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. 

‘హేయ్‌ నాకు ఈ ఆట తెలుసు. మా అమ్మ నాకు నేర్పించింది. ఒడిశాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి ఇంట్లో ఈ ఆట ఆడతారని తెలుసు’. అంటూ ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా.. ‘నేటితరం పిల్లలు ఇలాంటి ఆటలను కోల్పోతున్నారు. దీనిని హర్యానాలో ‘ఘెట్‌’ అని పిలుస్తారు’. అని మరో నెటిజన్‌ పేర్కొన్నారు. కాగా దీనిని వివిధ ప్రాంతాల్లో అనేక ఇతర పేర్లతో పిలుచుకుంటారు. మరి మీరు ఈ ఆటను ఎప్పుడైనా ఆడారా.. అయితే ఈ వీడియోను చూసి ఆ మధురానుజ్ఙాపకాలను మరోసారి గుర్తుతెచ్చుకోండి. 

Advertisement
Advertisement