ఆధార్ బేజార్ | Sakshi
Sakshi News home page

ఆధార్ బేజార్

Published Fri, Feb 13 2015 1:17 AM

ఆధార్ బేజార్ - Sakshi

రవాణా శాఖ సిబ్బందికి తలనొప్పి
గడువు ముగిసినా పూర్తికాని రిజిస్ట్రేషన్
జిల్లాలో 33 శాతం సీడింగ్ నమోదు
అయినా రాష్ట్రంలో మన జిల్లానే ఫస్ట్

 
విజయవాడ : వాహనాలకు ఆధార్ అనుసంధాన ప్రక్రియ రవాణా శాఖకు తలనొప్పిగా మారింది. నగరంలోని కార్యాలయ ఉద్యోగులు మొదలుకుని మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ల వరకూ అందరూ సాధారణ విధులు  మానుకుని ఈ ప్రక్రియలోనే తలమునకలవుతున్నారు. వాహనాల రిజిస్ట్రేషన్ కోసం రోడ్డున పడి శ్రమిస్తున్నా ఆశిం చిన స్థారుులో ప్రయోజనం కనిపించట్లేదు. మూడు నెలల కిందట రాష్ట్రం లోని 13 జిల్లాల్లో ఈ ప్రక్రియ మొదలైంది. ఈనెల పదోతేదీ నాటికే పూర్తి చేయూలని రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు నిర్ణయించారు. కానీ, ఇప్పటికి రాష్ట్రంలో కేవలం 24శాతం ఆధార్ లింకేజ్ మాత్రమే పూర్తరుుంది. అత్యధికంగా 33 శాతంతో కృష్ణాజిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిల వడం విశేషం.

డెడ్‌లైన్ దాటినా..

వాహనాల రికార్డులు భద్రపరచటమే లక్ష్యంగా రవాణా శాఖ తన సేవలన్నింటికీ ఆధార్ నంబర్ తప్పనిసరి చేసింది. ఈ క్రమంలోనే తొలుత కృష్ణా జిల్లాలోని గుడివాడ, కర్నూలు జిల్లాలోని నంద్యాల మున్సిపాలిటీలను పెలైట్ ప్రాజెక్ట్‌లుగా ఎంపికచేసి ఆధార్ వివరాలు సేకరించారు. ఇది జరిగిన వారం రోజుల తర్వాత పెలైట్ ప్రాజెక్ట్‌ను అధ్యయనం చేయకుండానే రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తెచ్చేశారు. అంతేకాదు.. ఈ ప్రక్రియను తక్షణమే పూర్తి చేయూలని రవాణా శాఖ కమిషనర్, మంత్రి తరచూ ఆదేశాలు జారీ చేస్తున్నారు. రెండు వారాలుగా ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిన క్రమంలో ప్రతి జిల్లాలో సగంమందికి పైగా సిబ్బందిని ఆధార్ లింకేజ్‌కే పురమారుుంచారు. మనజిల్లాలో రవాణాశాఖ, మెప్మా సిబ్బంది, ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు, ఇతర స్వచ్ఛంద సంస్థల సహకారంతో నిర్ణీత లక్ష్యంలో 33 శాతానికి చేరుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఈనెల ఒకటో తేదీన నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో మంత్రి శిద్దా రాఘవరావు మాట్లాడుతూ వాహనాలకు ఆధార్ అనుసంధానాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుందని, ఈనెల పదో తేదీ డెడ్‌లైన్ అంటూ ఆదేశాలు జారీ చేశారు. మంత్రి ఆదేశించిన గడువులోగా కేవలం 30శాతం మాత్రమే పూర్తికావటంతో దీనిని నిరంతర ప్రక్రియగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో నూరు శాతం పూర్తికావటానికి మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉంది.
 
లక్ష్యం బారెడు

జిల్లాలో ఆధార్ లింకేజ్ ప్రక్రియను వేగవంతం చేసినా ఫలితం  లేదు. రవాణా శాఖ ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు దీనిలో భాగస్వాములయ్యూరు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మనజిల్లా మొదటిస్థానంలో నిలిచింది. అరుుతే, జిల్లాలో 13,72,316 రికార్డులు సేకరించాల్సి ఉండగా, పదో తేదీ నాటికి 4,47,242 మాత్రమే పూర్తయ్యూరుు. విస్సన్నపేటలోని శ్రీసిద్ధార్థ విద్యాసంస్థల విద్యార్థులు మూడు రోజుల వ్యవధిలో 15వేల రికార్డులు సేకరించారు. రాష్ట్రంలోనే అత్యధిక వాహన రికార్డులు తక్కువ రోజుల్లో పూర్తిచేసి రికార్డు సృష్టించారు. దీంతో రవాణా శాఖ అధికారులు అన్ని ప్రైవే ట్ కళాశాలల్లో దీనిని నిర్వహించాలని భావించినా పరీక్షల కాలం దగ్గర పడటంతో విద్యార్థులకు ఇబ్బందిగా ఉం టుందని భావించి మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లతోనే పూర్తి చేయిస్తున్నారు.
 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement