ఆర్థికసహాయ పథకాల్లో 60 శాతం సబ్సిడీ | Sakshi
Sakshi News home page

ఆర్థికసహాయ పథకాల్లో 60 శాతం సబ్సిడీ

Published Sun, Jan 5 2014 5:53 AM

60 per cent of financial subsidy scheme

 ఉట్నూర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయ పథకాల్లో లబ్ధిదారులో గిరిజన ప్రాం తాలకు చెందిన వారికి 60 శాతం సబ్సిడీతో పాటు రూ.లక్ష వరకు మినహాయింపు ఇవ్వనున్నట్లు గిరి జన సంక్షేమ శాఖ కమిషనర్ ఉదయ్‌లక్ష్మి తెలిపారు. శనివారం ఆమె రాష్ట్రంలోని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులతో హైదరాబాద్ నుం చి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయ పథకాలను పూర్తిస్థాయిలో అందించడానికి షెడ్యూ ల్డు తెగల లబ్ధిదారుల ఎంపికలో నైపుణ్యత చూపించాలన్నారు.
 
 జీవో నంబర్ 101 ప్రకారం 2013-14 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్రవ్యాప్తంగా రూ.120 కోట్లతో అన్ని రకాల అర్హతలున్న దా దాపు 60 వేల మందికి సంక్షేమ పథకాలు అం దించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. సంక్షే మ పథకాలు అందించడానికి గిరిజన తెగల్లో 21 నుంచి 45 ఏళ్ల వయోపరిమితి, పీటీజీలకు ప్ర త్యేకంగా 50 ఏళ్ల వరకు వయసు నిర్ణయించిన ట్లు పేర్కొన్నారు. ఐటీడీఏల పరిధిలో ప్రతి కు టుంబంలో ఒకరికే ప్రభుత్వ పథకాలు అందించనున్నట్లు చెప్పారు. మరలా ఆ కుంటుంబానికి ఐదేళ్ల వరకు సంక్షేమ పథకాలు అందవని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఈ నెల 21లోగా గ్రౌండింగ్ పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని రకాల దరఖాస్తులు ఆన్‌లైన్ ద్వారా పంపాలని సూచించారు. అనంతరం పోస్టుమెట్రిక్ స్కాలర్‌షిప్‌ల మంజూరు, ఎంపిక, రెన్యూవల్ తదితర అంశాలపై సమీక్షించారు. ఐటీడీఏ పీవో జనార్దన్ నివాస్, ఏవో భీం, వివిద విభాగాల అధికారులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement