భక్తులకు టోపీ | Sakshi
Sakshi News home page

భక్తులకు టోపీ

Published Mon, Mar 14 2016 2:51 AM

64 grams of gold jump

64 గ్రాముల బంగారంతో ఉడాయింపు

తిరుమల: తిరుమలకు వచ్చిన ఇద్దరు భక్తులను నమ్మించి, వారి బంగారం తీసుకుని ఉడాయించిన ఘట న ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. క్రైం పోలీసుల కథ నం మేరకు... తిరుపతికి చెందిన శంకర్‌రావు తిరుమల భక్తులకు నిత్యం శ్రీవారి దర్శనాలు చేయించడం, లడ్డూ లు తీసి ఇచ్చే వ్యాపారం చేసేవాడు. ఈ నేపథ్యంలో ఇత డు వేలూరుకు చెందిన సతీష్‌కుమార్, జ్యోత్స్న దంపతులకు తాను టీటీడీలో విజిలెన్స్ ఉద్యోగినని గతంలో పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే వారికి అప్పుడప్పు డు లడ్డూలు తీసి పంపి, డబ్బులు తీసుకునేవాడు. స్వామివారి విశేషపూజ చేయిస్తానని ఇటీవల వారి నుం చి రూ.5 వేలు నగదు తీసుకున్నాడు. దీంతో సతీష్ దంపతులు శనివారం తిరుమలకు వచ్చారు. పుష్కరిణిలో స్నానమాచరించారు.

విశేషపూజలో పాల్గొనే వారు బంగారం ధరిం చకూడదని వారిని నమ్మబలికాడు. వారి వద్ద ఉన్న రెండు బంగారు గాజులు, రెండు చైన్లు మొత్తం 64 గ్రాముల నగలను తన వద్ద భద్ర పరుస్తానని తీసుకున్నాడు. తరువాత చాకచక్యంగా అక్కడి నుంచి తప్పించుకుని వెళ్లిపోయా డు. ఎంతసేపైనప్పటికీ రాకపోవడంతో బాధిత భక్తులు స్థానిక క్రైం పోలీస్‌ష్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
 

Advertisement
Advertisement