‘మధ్యాహ్న భోజనం’పై నిఘా.. విద్యార్థి కమిటీలు | Sakshi
Sakshi News home page

‘మధ్యాహ్న భోజనం’పై నిఘా.. విద్యార్థి కమిటీలు

Published Tue, Aug 5 2014 3:28 AM

'.. A student of the intelligence committees in the afternoon bhojanampai

మధ్యాహ్న భోజనం.. పేద విద్యార్థుల పాలిట వరం. చదువుతో పాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రూపొందించింది. అరుుతే, ఇటీవలకాలంలో మధ్యాహ్న భోజనం అమలుతీరుపై పలు విమర్శలు వచ్చారుు. అటువంటి ఇబ్బందులను తొలగించి.. విద్యార్థులకు పౌష్టికాహారం అందించేందుకు కృషి చేస్తున్నారు రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా  అభియాన్ జిల్లా ఉప విద్యాశాఖ అధికారి గరిమెళ్ల అన్నాజీరావు. సోమవారం గుడివాడ వచ్చిన సందర్భంగా మధ్యాహ్న భోజనం అమలు తీరు, సౌకర్యాలపై పలు విషయాలు ‘సాక్షి’కి తెలిపారు.    
 
ప్రశ్న : జిల్లావ్యాప్తంగా మధ్యాహ్న భోజనం అమలు తీరుపై మీరు తీసుకుంటున్న చర్యలేమిటీ?

జవాబు : జిల్లాలో 376 పాఠశాలల్లో 1.40 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. గత ఏడాది కేవలం 90వేల మంది మాత్రమే పాఠశాలల్లో భోజనం చేసేవారు. నేను బాధ్యతలు చేపట్టాక ఆ సంఖ్య పెంచాను.
 
ప్రశ్న :  ‘విద్యార్థుల భాగ్వస్వామ్యం’ అంటే..
జ : ప్రతి పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులను రెడ్‌హౌస్, గ్రీన్‌హౌస్, బ్లూహౌస్, ఎల్లోహౌస్ కమిటీలుగా విభజిస్తాం. రోజుకొక టీమ్ మధ్యాహ్న భోజన విధులు నిర్వర్తిస్తుంది. ఏరోజు ఏకమిటీ ఏ పని  చేయాలో ముందుగానే నిర్ణయిస్తాం. ఎంతమంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. పప్పు, కూరగాయల పరిమాణం, బియ్యం నాణ్యత, వాసన వస్తుందా, లేదా వంటి విషయూలను పరిశీలిస్తారు. వంట రుచిగా లేకపోరునా ఈ కమిటీ ఫిర్యాదు చేయవచ్చు. ప్రతి విద్యార్థికీ రోజుకు 30 గ్రాముల పప్పు, 75 గ్రాముల కూరగాయూలు ఇవ్వాలి. ఇందుకోసమే వంటల్లో ఏది ఎంత మోతాదులో వేయాలో విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం.
 
ప్రశ్న : పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలేమిటీ?
జ :  పాఠశాలలకు కావాల్సిన ఫినాయిల్, క్లీనింగ్ పౌడర్, హెండ్ వాష్ లిక్విడ్ వంటి వాటి తయూరీపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం. దీనివల్ల పరిశుభ్రమైన వాతావరణంతో పాటు తయూరీపై పిల్లలకూ అవగాహన కలుగుతుంది.
 
ప్రశ్న : మధ్యాహ్న భోజనంపై సమస్యలను ఎవరికి తెలియజేయాలి?
జ :  పాఠశాలల్లో కమిటీలు వేశాక మంచి ఫలితాలే వస్తున్నారు. ఎక్కడైనా మధ్యాహ్న భోజనం బాగాలేకపోతే వెంటనే నా ఫోన్‌కు విద్యార్థులు ఫోన్‌చేసి ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే చర్యలు తీసుకుంటాం.
 
ప్రశ్న :  పాఠశాలల్లో వసతుల కల్పనకు నిధుల మాటేమిటీ?
జ : ప్రతి పాఠశాలకు రూ.75వేలు ఆర్‌ఎంఎస్‌ఏ ద్వారా నిధులు మంజూరుచేశారు. జిల్లాలోని 376 పాఠశాలలకు రూ.2.82కోట్లు మంజూరయ్యాయి. సైన్స్ ల్యాబ్ పరికరాల కొనుగోలుకు రూ.25వేలు, లైబ్రరీ పుస్తకాల కోసం రూ.10వేలు, కరెంట్ రిపేర్లకు రూ.15వేలు, మైనర్ రిపేర్లకు రూ.25వేలు ఖర్చుచేయూలి.
 
ప్రశ్న :  వంట ఏజెన్సీలకు మీరిచ్చే సూచనలు?

జ :  ప్రతి వంట ఏజెన్సీ వారు ప్రభుత్వ నిబంధనల ప్రకారం కూరగాయలు, పప్పు వంటి సరుకులు తెచ్చుకోవాలి. ఈ ఏడాది ప్రతి పాఠశాలలో నూరుశాతం విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేయూలనేదే నా లక్ష్యం. వంట బాగా చేసిన ఏజెన్సీలకు ప్రోత్సాహక బహుమతులు ఇస్తున్నాం. పాఠశాల ప్రధానోపాధ్యాయులకు జిల్లా కలెక్టర్ ప్రశంసాపత్రం అందజేసి సన్మానిస్తాం.
 
 ‘మధ్యాహ్న భోజనం’పై మీరు ఫిర్యాదు చేయూలంటే..
మధ్యాహ్న భోజనంలో  లోపాలు ఉన్నా.. రుచిగా లేకపోయినా.. ఏమైనా తప్పులు జరుగుతున్నా.. అవినీతి జరిగినా.. విద్యార్థులు, తల్లిదండ్రులు ఎవరైనా నాకు నేరుగా ఫోన్ చేయవచ్చు. నా నంబరు 9440395869.
 

Advertisement
Advertisement