Actor,Director,Producer అమరప్రసాద్ | Sakshi
Sakshi News home page

Actor,Director,Producer అమరప్రసాద్

Published Fri, Aug 8 2014 1:36 AM

Actor,Director,Producer అమరప్రసాద్ - Sakshi

సమాజానికి మేలుచేసే ఎన్నో  డాక్యుమెంటరీ చిత్రాలను ఆయన నిర్మించారు. కొన్నింటికి దర్శకత్వం వహించారు. మరికొన్ని సీరియల్స్‌లో నటుడిగా రాణించారు. అన్నింట్లోనూ తనదైన ప్రతిభ కనబరుస్తూ ‘నందులు’ అందుకున్నారు. ఆయనే కౌతవరానికి చెందిన చల్లపల్లి అమరప్రసాద్. డాక్యుమెంటరీ ఫిల్మ్స్ నిర్మాణంలో ప్రత్యేక ముద్ర  వేసుకున్న ప్రసాద్ విజయ గాథ..
 
కౌతవరం (గుడ్లవల్లేరు) : నిర్మాత, దర్శకుడిగానే కాకుండా నటుడిగా ఎనలేని కీర్తిప్రతిష్టలు సంపాదించుకున్నారు కౌతవరానికి చెందిన చల్లపల్లి అమరప్రసాద్. సీరియల్స్, ప్రభుత్వ  ప్రకటనల డాక్యుమెంటరీ ఫిల్మ్‌లను తీస్తూ ఎంతో పేరు సంపాదించారు. చల్లపల్లి సొంత ఊరరుుతే, కౌతవరం అమ్మమ్మ గారి ఊరు. తాత స్వాతంత్య్ర సమరయోధుడు తాళ్లూరి మంగపతిరావు. ఉద్యమం కోసం ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకున్న గొప్ప దేశభక్తుడాయన. మరో తాత భూపోరాటం చేసి జమిందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమించిన చల్లపల్లి నారాయణరావు. చిన్నతనంలో అమ్మమ్మ తాతయ్య వద్ద పెరిగిన అమరప్రసాద్ పదో తరగతి వరకు కౌతవరంలోనే చదువుకున్నారు.
 
తాతల స్ఫూర్తితో..


తాతలు మంగపతిరావు, నారాయణరావు స్ఫూర్తే సామాజిక స్పృహ కలిగించే డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌కు సంబంధించిన ప్రకటనల మేకింగ్‌కు అమరప్రసాద్‌ను పురిగొల్పింది.  రైల్వే దొంగల బారి నుంచి బయటపడేదెలా.., బాల కార్మికుల నిర్మూలనకు చేపట్టాల్సిన చర్యలపై వందకుపైగా ప్రభుత్వ రంగ ప్రకటనలను డాక్యుమెంటరీలుగా తీశారు. వీటన్నింటికీ  నిర్మాతగా వ్యవహరించిన ఆయన  ప్లాస్టిక్ నియంత్రణ డాక్యుమెంటరీకి మాత్రం దర్శకుడిగా పనిచేయాల్సి వచ్చింది. అంతేకాదు,   ‘అపరంజి’ అనే సీరియల్‌లో ప్రతినాయకుడిగా కూడా ఆయన పాత్ర పోషించారు.
 
నందుల పంట
 
అమరప్రసాద్ నిర్మించిన ప్లాస్టిక్ నియంత్రణ  డాక్యుమెంటరీకి నంది పురస్కారం లభించింది. ఈ    అవార్డును బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ బచ్చన్ చేతులమీదుగా ఆయన అందుకున్నారు. డాక్యుమెంటరీల మేకింగ్‌లో ఆయన ప్రతిభను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం 1994, 1997, 2000, 2012లో రెండు నంది అవార్డులు ఇచ్చి ప్రోత్సహించింది.
 
కౌతవరంలో సీరియల్

ప్రస్తుతం కౌతవరంలో ఓ టీవీ సీరియల్ తీసేందుకు అమరప్రసాద్ సిద్ధమవుతున్నారు. చిన్ననాటి మధుర స్మృతులను గుర్తు చేసుకునేలా ఈ ప్రాంతంలో షూటింగ్ చేయడం ఆనందంగా ఉందని ఆయన ‘సాక్షి’కి చెప్పారు.
 
కౌతవరం ఎప్పుడూ వస్తా..

కౌతవరమంటే నాకెంతో ఇష్టం. అవకాశం కుదిరినపుడల్లా ఇక్కడికొచ్చి నా చిన్ననాటి స్మ­ృతులు గుర్తుచేసుకుంటా. నా స్నేహితులను కలుసుకుంటా. ‘ఓ చిట్టెమ్మ కథ’ అనే మత్స్యకారుల జీవనశైలిపై నిర్మించిన డాక్యుమెంటరీ నాకెంతో నచ్చింది. తాత చల్లపల్లి నారాయణరావు జీవితగాథను ఇతివృత్తంగా చేసుకుని నిర్మించిన ‘అమరవీర’ డాక్యుమెంటరీకి మంచి స్పందన లభించింది.
 

Advertisement
Advertisement