ఏజెన్సీలో అటవీ అభివృద్ధికి చర్యలు | Sakshi
Sakshi News home page

ఏజెన్సీలో అటవీ అభివృద్ధికి చర్యలు

Published Fri, Aug 29 2014 12:37 AM

ఏజెన్సీలో అటవీ అభివృద్ధికి చర్యలు - Sakshi

  • విశాఖ సీఎఫ్ భరత్‌కుమార్
  • పాడేరు: విశాఖ ఏజెన్సీలోని అటవీ అభివృద్ధికి ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నట్లు విశాఖపట్నం కన్సర్వేటర్ ఆఫ్ ఫా రెస్ట్ (అటవీ సంరక్షణాధికారి) ఎ.భరత్‌కుమార్ తెలిపారు. పాడేరు రేంజి పరిధిలోని కిముడుపల్లి పంచాయతీ పెదగరువు, మచ్చుపల్లి ప్రాంతాల్లో చేపడుతున్న ఏక్రో కార్పస్ మొక్కల పెంపకం కార్యక్రమాన్ని శుక్రవారం ఆయన  పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.

    ఇతర జాతుల మొక్కలు కూడా ఏపుగా పెరగడంతో అటవీ అభివృద్ధికి చేపడుతున్న చర్యలను ఆయన అభినందించారు. రాతిగట్లు, నీటి నిల్వ చేసే కందకాల నిర్మాణం, గ్రీన్ ఇండియా పథకంలో చేపడుతున్న మొక్క ల పెంపకాన్ని ఆయన పరిశీలించారు.

    అనంతరం అటవీ సంరక్షణ కార్యక్రమాలపై పాడేరు డీఎఫ్‌ఓ కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. రికార్డులను తనిఖీ చేశారు. డీఎఫ్‌ఓ శాంతారామ్, సబ్ డీఎఫ్‌ఓ శాంతి స్వరూప్, రేంజ్ అధికారి ఎస్.గంగాధరరావు, ఏబీఓ రామారావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement