విజిలెన్స్ అధికారుల దాడులు | Sakshi
Sakshi News home page

విజిలెన్స్ అధికారుల దాడులు

Published Thu, Feb 13 2014 12:11 AM

విజిలెన్స్ అధికారుల దాడులు - Sakshi

విజిలెన్స్ అధికారుల దాడులు
 తాడేపల్లి రూరల్ మండల పరిధిలోని ప్రాతూరు క్రాస్ రోడ్స్ వద్ద బుధవారం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి నాలుగు ఇసుక లారీలు సీజ్ చేశారు. మొదట విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి ప్రాతూరు క్రాస్‌రోడ్స్ నుంచి అధిక సంఖ్యలో ఇసుక లారీలు తరలి వెళుతుండగా, వాటిని ఆపి ధృవపత్రాలు ఉన్నాయో, లేవోనని పరిశీలించారు. వే బిల్లులపై తేదీ ఉండడం, సరైన సమయం నమోదు చేసి ఉండకపోవడంతో ఎస్పీకి అనుమానం వచ్చి డ్రైవర్లను ప్రశ్నించారు. ఉద యం పూట ఇసుక లోడు చేసినందుకుగాను త మ వద్ద సీనరేజిగా రూ.5500 తీసుకుంటారని, అదే సాయంత్రం వే బిల్లులు లేకుండా రూ, 4800 తీసుకుంటారని తెలిపారు. నాలుగు లారీలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేసి తాడేపల్లి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అక్కడ నుంచి విజిలెన్స్ అధికారులు గుండిమెడ ఇసుక క్వారీకి వెళ్లారు. మార్గమధ్యలో ఒక ఇసుక లోడుతో వస్తున్న లారీని ఆపగా, అధికారులను చూచి లారీ డ్రైవర్ లారీ అక్కడే వదిలివేసి పారిపోయాడు. అనంతరం ఇసుక క్వారీలోకి వెళ్లిన అధికారులు పలు విషయలపై క్వారీ నిర్వాహకులను ప్రశ్నించారు.
 నిర్వాహకుడిపై విజిలెన్స్ ఎస్పీ ఆగ్రహం
 నిబంధనలకు విరుద్దంగా వే బిల్లులపై సరైన సమయం నమోదు చేయకుండా ఇసుక లోడుల ఉదంతంపై కార్వీ నిర్వాహకుడిని విజిలెన్స్ ఎస్పీ అమ్మిరెడ్డి నిలదీశారు. గతంలో రూ. 4 కోట్ల విలువైన ఇసుక క్వారీని సామాన్య మధ్యతరగతి వారికి గృహ నిర్మాణానికిగాను ప్రభుత్వం రూ.40 లక్షలకే కేటాయించగా, అధిక ధరలకు ఇసుక విక్రయిస్తున్నారంటూ ఎస్పీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
 
 

Advertisement
Advertisement