బాబు పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు | Sakshi
Sakshi News home page

బాబు పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు

Published Sun, Jul 23 2017 3:37 AM

బాబు పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు - Sakshi

వైవీ సుబ్బారెడ్డి
కేంద్ర హోం మంత్రి, జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌కు ఫిర్యాదు చేశామని వెల్లడి


సాక్షి, హైదరాబాద్‌: ఏపీలో చంద్రబాబునాయుడు పాలనలో దళితులపై దాడులు, అత్యాచారాలు విపరీతంగా పెరిగి పోయాయని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. దళితులపై దాడుల్లో ఏపీ దేశంలోనే రెండో స్థానంలో ఉందని, 21 మంది మహిళలను వివస్త్రలను చేసిన సంఘటనలు కూడా ఏపీలోనే జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆయన శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు పూర్తిగా దళిత వ్యతిరేకి అని, గత నాలుగైదు నెలలుగా జరుగుతున్న సంఘటనలే ఇందుకు నిదర్శనమని చెప్పారు. 2015 క్రైంబ్యూరో రిపోర్టు ప్రకారం ఏపీలో 4,415 దళితులపై కేసులు నమోదయ్యాయయని 4,455 మంది బాధితులుగా ఉన్నారని తెలిపారు.

మొత్తం 300 మంది మహిళలపై దాడులు జరిగితే అందులో 100 మంది దళితులేనన్నారు. దేవరపల్లి ఘటనపై కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, జాతీయ ఎస్సీ కమిషన్‌ చైర్మన్‌ రమాశంకర్‌ ఖతార్‌ను కలిసి ఫిర్యాదు చేశామని చెప్పారు. నంద్యాలలో అధికార దుర్వినియోగం, ఇష్టానుసారం నిధుల కేటాయింపుపై కేంద్ర ఎన్నికల కమిషన్‌కు మళ్లీ ఫిర్యాదు చేస్తామని ఆయన తెలిపారు.

Advertisement
Advertisement