క్యాంపస్ లోనే బోగస్ కంపెనీల రిక్రూట్మెంట్! | Sakshi
Sakshi News home page

క్యాంపస్ లోనే బోగస్ కంపెనీల రిక్రూట్మెంట్!

Published Fri, Mar 7 2014 12:50 PM

bogus companies recruitment in campus of vikas engineering college!

కాకినాడ: విద్యార్థులకు టోకరా వేస్తున్న బోగస్ కంపెనీలకు కొదువేలేదు. లక్షల్లో డబ్బులు చెల్లించి ఆ కంపెనీలు దెబ్బకు తేరుకోలేక విద్యార్థులు నానా అగచాట్లు పడుతుంటారు. అవే బోగస్ కంపెనీలు క్యాంపస్ లోకే ప్రవేశించి విద్యార్థుల ఎంపికకు పూనుకుంటే.. ఇక విద్యార్థుల పరిస్థితి ఎలా ఉంటుంది. ఇటువంటి ఘటనే పట్టణంలోని వికాస్ ఇంజనీరింగ్ కాలేజ్ లో చోటు చేసుకుంది. కొన్ని కంపెనీలు క్యాంపస్ రిక్రూట్మెంట్ పేరుతో 200 మంది విద్యార్థులను ఎంపిక చేసి తొలుత తాము చేయాల్సిన పనిని ముగించారు. ఇక విద్యార్థులు ఆ కంపెనీల నుంచి కాల్ లెటర్స్ కోసం వేచిచూచినా ఎంతకూ రాలేదు.

 

దీనిపై విద్యార్థులు ఆరా తీయగా అవి బోగస్ కంపెనీలని తేలాయి. దీంతో విద్యార్థులు వికాస్ కాలేజ్ ఆఫీస్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఆ కంపెనీలు వివరాలు తెలుసుకోకుండా రిక్రూట్ మెంట్ నిర్వహణకు కాలేజీ యాజమాన్యం వారికి ఎలా అనుమతిచ్చిందో చెప్పాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
 

Advertisement
Advertisement