Sakshi News home page

సిగ‘రేట్’ ఇష్టానుసారం

Published Mon, Feb 17 2014 2:10 AM

సిగ‘రేట్’ ఇష్టానుసారం


 సిగ‘రేట్’ ఇష్టానుసారం
 పత్తికొండ అర్బన్,  : మండలంలోని హోల్‌సేల్, రిటైల్ సిగరెట్ వ్యాపారులు ధూమపాన ప్రియులను నిలువునా దోపిడీ చేస్తున్నారు. సిగరెట్లకు కృత్రిమ కొరత సృష్టిస్తూ ఇష్టానుసారంగా ధరలను పెంచి విక్రయాలు చేపడుతున్నారు. వాటికి రసీదులు కూడా ఇవ్వకుండా జీరో బిజినెస్ చేస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అదేమిటని ప్రశ్నిస్తే బడ్జెట్ వచ్చే వరకు ధరల నియంత్రణ సాధ్యం కాదని పేర్కొంటున్నారు. మండల పరిధిలోని దాదాపు 600 దుకాణాలకు పట్టణంలోని పది హోల్‌సేల్ షాపుల నుంచి సిగరెట్లు, బీడీలు తదితర వస్తువులు సరఫరా అవుతున్నాయి. ఆయా దుకాణాల్లో రోజూ వేల రూపాయల నుంచి లక్షల రూపాయల వరకు వ్యాపారాలు సాగుతాయి. గోల్డ్‌ఫ్లాక్ ప్యాక్ ఎంఆర్‌పీ రూ.59 ఉండగా హోల్‌సేల్‌లో రూ.55కే ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ఆ ప్యాక్‌ను రూ.60కి విక్రయిస్తున్నారు. పెద్దగోల్డ్ ఫ్లాక్ ప్యాక్ ఎంఆర్‌పీ రూ.75 ఉండగా హోల్‌సేల్‌లో రూ.70కి అమ్మాలి. కానీ రూ.78 నుంచి 80కి అమ్ముతున్నారు. బ్రిస్టల్, సిజర్, విల్స్‌ఫ్లాక్ ప్యాక్‌లు రూ.40కి విక్రయించాల్సి ఉండగా అధనంగా రూ.5 వసూలు చేస్తున్నారు. ఇప్పటి వరకు చిల్లర వ్యాపారులు స్మాల్ గోల్డ్‌ఫ్లాక్ సిగరెట్ రూ.6, పెద్దగోల్డ్ రూ.8 వరకు విక్రయిస్తూ వచ్చారు. అయితే కత్రిమ కొరత సృష్టించిన వ్యాపారులు కుమ్మక్కై స్మాల్ గోల్డ్‌ప్లాక్ రూ.7, పెద్దగోల్డ్‌ఫ్లాక్ సిగరెట్ రూ.9కి విక్రయిస్తున్నారు. ఈ ధరల గురించి బయట చెబితే సరుకు ఇవ్వబోమని హోల్‌సేల్ వ్యాపారులు చిరువ్యాపారులను బెదిరిస్తున్నారు. పొగతాగితే ఆరోగ్యం పాడవుతుందని తెలిసినా పట్టించుకోని దూమపాణ ప్రియులు ఈ ధరలతో ఇబ్బందులు పడుతున్నారు.
 

Advertisement

What’s your opinion

Advertisement