‘వారి కుటుంబాలు ఆందోళన చెందొద్దు’

23 Apr, 2020 15:52 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: లాక్‌డౌన్‌ కారణంగా  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది మత్సకారులు గుజరాత్‌లో చిక్కుకుపోయారని, వారిని తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయని కోవిడ్‌-19 టాస్క్‌ఫోర్స్‌ చైర్మన్‌ కృష్ణబాబు తెలిపారు. వారి కుటుంబసభ్యలు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. గురువారం తాడేపల్లిలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీతో ఈ విషయంపై మాట్లాడారని, మన వాళ్లకి అక్కడ ఆహారాన్ని అందిస్తున్నారని  చెప్పారు. దానికి కోసం ఏపీ ప్రభుత్వమే వారి ఖర్చు భరిస్తోందని చెప్పారు.

(విజయ్ రూపానీకి సీఎం జగన్ ఫోన్)

ఆహారం విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయిన వసతి విషయంలో కొంత ఇబ్బంది ఉందని తెలిపారు. స్పెషల్‌ కేసు కింద వారిని ఇక్కడికి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారన్నారు. ప్రత్యేక వెస్సెల్‌ ద్వారా వారిని ఏపీకి తీసుకువస్తామని తెలిపారు. వైఎస్‌జగన్‌ వారిని తీసుకువచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. ఇక్కడికి చేరుకున్న తరువాత వారికి అన్ని రకాల వైద్యపరీక్షలు చేస్తామన్నారు. అక్కడ ఉన్న మత్యకారులలో ఇద్దరు చనిపోయారని, అయితే వారికి కరోనా లక్షణాలు లేవని కృష్ణబాబు తెలిపారు. 

(కరోనా: రహస్యంగా వస్తున్న వలస మత్స్యకారులు )

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు