'అనంత'లో కొనసాగుతున్న ఆందోళనలు

17 Jun, 2015 09:14 IST|Sakshi

అనంతపురం: వేరు శెనగ విత్తనాలు పంపిణీ చేయాలంటూ అనంతపురం పట్టణంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం అనంతపురం నగరంలోని తపోవనం వద్ద సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ ఆధ్వర్యంలో 44వ నంబరు జాతీయ రహదారిని దిగ్బంధించారు. 

దీంతో బెంగళూరు - హైదరాబాద్ రహదారిలో కిలో మీటరు మేర వాహనాలు నిలిచి పోయాయి. అనంతరం కలెక్టరేట్ వద్ద సీపీఐ నేతలు ధర్నా నిర్వహిస్తున్నారు. వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేసేంత వరకు తమ దీక్షలు ఆపేది లేదని ఈ సందర్భంగా సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ఈ విషయంలో పోలీసులు కల్పించుకుని సీపీఐ జిల్లా అధ్యక్షుడు జగదీశ్ తో సహా 100 మంది సీపీఐ నేతలను అరెస్టు చేశారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు