Sakshi News home page

జెడ్పీ స్థాయీ సంఘాల ఎన్నిక పూర్తి

Published Sun, Aug 3 2014 12:28 AM

Developing district-level committees

పాతగుంటూరు: జిల్లాను అభివృద్ధి పథంలో నడిపేందుకు అవసరమైన జెడ్పీ స్థాయి సంఘాలను శనివారం ఎన్నుకున్నారు. జిల్లాపరిషత్ కార్యాలయంలో జెడ్పీ మొదటి సర్వసభ్య సమావేశాన్ని శనివారం నిర్వహించారు.  జెడ్పీ చైర్‌పర్సన్ షేక్ జానీమూన్,  సీఈవో సుబ్బారావు, కలెక్టర్ కాంతిలాల్ దండే, మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు  పాల్గొన్న ఈ సమావేశంలో స్థాయీ సంఘాల చైర్మన్లు, సభ్యులను ఎంపిక చేశారు. మొత్తం ఏడు సంఘాల చైర్మన్ పదవులు అధికార టీడీపీకే దక్కాయి.
 
 మొదటిది ప్రణాళిక, ఆర్థికం..
 ప్రణాళిక, ఆర్థిక అంశాలకు చెందిన ఒకటో స్థాయి సంఘం  చైర్మన్‌గా షేక్ జానీమూన్‌ను ఎన్నుకొన్నారు. ఆమె పేరును ప్రత్తిపాడు జెడ్పీటీసీ సభ్యుడు డొక్కమళ్ల  భాగ్యారావు ప్రతిపాదించగా, తుళ్లూరు జెడ్పీటీసీ సభ్యుడు బెజవాడ నరేంద్రబాబు బలపరిచారు. ఇందులో  సభ్యులుగా ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్(తెనాలి), జీవీఎస్ ఆంజనేయులు(వినుకొండ), కొమ్మాలపాటి శ్రీధర్(పెదకూరపాడు), జెడ్పీటీసీ సభ్యులు శివరామకృష్ణ(నగరం), బండారు కుమారి(భట్టిప్రోలు), కోటా శ్రీనివాసరావు(పొన్నూరు), వెంకాయమ్మ(సత్తెనపల్లి), వలపా బాలస్వామి( కారంపూడి), కామినేని సాయిబాబు(యడ్లపాడు), గింజుపల్లి ఎలిజబెత్‌రాణి(గురజాల), దండమూడి శైలజారాణి(తాడేపల్లి), దేవళ్ల రేవతి(బెల్లంకొండ) ఉన్నారు.
 
 రెండు..గ్రామీణాభివృద్ధి..
 రెండోస్థాయి సంఘం చైర్మన్‌గా షేక్ జానీమూన్‌ను ఎన్నుకొన్నారు. ఆమె పేరును తాడికొండ జెడ్పీటీసీ సభ్యుడు వడ్లమూడి పూర్ణచంద్రరావు (వైస్‌చైర్మన్) ప్రతిపాదించగా, అచ్చంపేట జెడ్పీటీసీ సభ్యుడు నల్లమేకల వెంకటేశ్వర్లు బలపరిచారు. ఇందులో సభ్యులుగా ఎమ్మెల్యేలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(మంగళగిరి), యరపతినేని శ్రీనివాసరావు(గురజాల), ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు, జెడ్పీటీసీ సభ్యులు బందెల కన్నయ్య(ఈపూరు), షేక్. మస్తాన్ షరీఫ్(పెదకూరపాడు), బెజవాడ నరేంద్రబాబు(తుళ్ళూరు), కాగితీల సుబ్బారావు(రేపల్లె), వెంకటరామిరెడ్డి(రాజుపాలెం), నారపురెడ్డి(పిట్టలవానిపాలెం), ప్రసాదం వాసుదేవ( నిజాంపట్నం), వీరభద్రుని రామిరెడ్డి( పిడుగురాళ్ళ) ఉన్నారు.
 
 మూడో సంఘం.. వ్యవసాయం...
 ఈ స్థాయి సంఘానికి చైర్మన్‌గా వడ్డమూడి పూర్ణచంద్రరావును ఎన్నుకున్నారు. సభ్యులుగా మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి, నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు, ఎమ్మెల్సీ సింగం బసవపున్నయ్య, జెడ్పీటీసీ సభ్యులు లాలీబాయి( మాచవరం), గోపిరెడ్డి శౌరిరెడ్డి(మాచర్ల), నవులూరు భాస్కరరెడ్డి(రెంటచింతల), ములగండ్ల ప్రకాష్‌రెడ్డి(దాచేపల్లి), కోఆప్షన్ సభ్యుడు నక్కా సవర్ణరాజు ఉన్నారు.
 
 నాలుగు విద్య, వైద్యం..
 ఈ సంఘానికి చైర్మన్‌గా షేక్ జానీమూన్‌ను ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్, అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి, ఎమ్మెల్సీ కె.యస్.లక్షణరావు, రాజ్యసభ సభ్యుడు జె.డి. శీలం, జెడ్పీటీసీ సభ్యులు చందోలు పృధ్వీలత( అమృతలూరు), సాంబశివరావు(మేడికోండూరు), బత్తుల సుశీల(వినుకొండ), వి. వెంకటేశ్వర్లు(వేమూరు), యేళ్ళ జయలక్ష్మి(దుగ్గిరాల), గుంపుల కన్నయ్య(కర్లపాలెం), కళ్ళం కృష్ణవేణి(వెల్దుర్తి) ఉన్నారు.
 
 ఐదు.. మహిళా శిశు సంక్షేమం..
 వట్టిచెరుకూరు జెడ్పీటీసీ సభ్యురాలు ఉప్పటూరి సీతామహాలక్ష్మిని  ఈ సంఘానికి చైర్మన్‌గా ఎన్నుకున్నారు. సభ్యులుగా ఎమ్మెల్సీలు మహమ్మద్ జానీ, నన్నపనేని రాజకుమారి, జెడ్పీటీసీ సభ్యులు ఆదెమ్మ(నూజెండ్ల), టి. శివపార్వతి(పెదకాకాని), హాజర్‌బీ(అమరావతి), యన్. సునీత(ఫిరంగిపురం), సంతోషమ్మ(బొల్లాపల్లి), జిల్లి శిరీషారెడ్డి(రొంపిచర్ల), అత్తోట సుధారాణి(చేబ్రోలు),  కొండా శివపార్వతమ్మ(చుండూరు) ఉన్నారు.
 
 ఆరో సంఘం..సాంఘిక సంక్షేమం..
 ఈ సంఘానికి చైర్మన్‌గా క్రోసూరు జెడ్పీటీసీ సభ్యులు చిలకా విల్సన్ గ్లోరిని ఎన్నుకున్నారు. ఇందులో సభ్యులుగా మంత్రి రావెల కిషోర్‌బాబు, ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి(నరసరావుపేట), నక్కా ఆనందబాబు(వేమూరు), బాపట్ల ఎంపీ మాల్యాద్రి, జెడ్పీటీసీ సభ్యులు రాయపూడి సుజనమ్మ(చిలకలూరిపేట), భాగ్యారావు(ప్రత్తిపాడు), రత్నమణి(బాపట్ల), ఆర్.సాంబ్రాజ్యంబాయి(నకరికల్లు), బీ.వెంకటలక్ష్మి( కొల్లిపర), యనమల మమత(ముప్పాళ్ళ), కొలకలూరు కోటేశ్వరరావు(గుంటూరు) ఉన్నారు.
 
 ఏడో సంఘం..
 అభివృద్ధి పనులు, విద్యుత్, రవాణా, గ్రామీణనీటిసరఫరాకు సంబంధించిన ఈ స్థాయిసంఘం చైర్మన్‌గా షేక్ జానీమూన్ ఎన్నికయ్యారు. సభ్యులుగా ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్(పొన్నూరు), అనగాని సత్యప్రసాద్(రేపల్లె), తెనాలి శ్రావణ్‌కుమార్(తాడికొండ),  జెడ్పీటీసీ సభ్యులు మల్లవరపు రవికుమార్(శ్యావల్యాపురం), క్రోసూరు అయ్యప్ప(కొల్లూరు), ఆకుల జయసత్య(మంగళగిరి), అన్నాబత్తుని జయలక్ష్మి(తెనాలి), చింతలపూడి నాగలక్ష్మి(నాదెండ్ల), కొనకంచి హైమావతి(దుర్గి), బత్తిని శారద(పెదనందిపాడు), నల్లమేకల వెంకటేశ్వర్లు(అచ్చంపేట), షేక్ నూరుల్ ఆక్తాబ్(నరసరావుపేట) ఎన్నికయ్యారు.
 

Advertisement

What’s your opinion

Advertisement