ప్రజల ఏకరువు! | Sakshi
Sakshi News home page

ప్రజల ఏకరువు!

Published Fri, Jun 2 2017 1:10 AM

Drought group from Delhi

పుల్లలచెరువు : ఢిల్లీ నుంచి వచ్చిన కరువు బృందం గురువారం మండలంలో పర్యటించింది. కరువు బృందం సభ్యుడు ఆమితాబ్‌ గౌతం నాయకత్వంలో మండలంలోని వివిధ గ్రామాల్లో సుడిగాలి పర్యటన చేసి వాస్తవ పరిస్థితులను తెలుసుకుంది. కరువు బృందం వెంట జాయింట్‌ కలెక్టర్‌ నాగలక్ష్మి ఉన్నారు. సభ్యులు తొలుత సుద్దకురవ తండాలోని గిరిజనులతో ముఖాముఖి అయ్యారు. తండా వాసులు హనుమానాయక్, శివానాయక్, రాజకోండ గ్రామస్తుడు రామిరెడ్డిలు మాట్లాడుతూ సుద్దకురవతండాలో సమారు 100 ఎకరాల్లో వేసిన ఉద్యానవన పంటలు ఎండి పొయ్యాయని, ముఖ్యంగా భూగర్భ జలాలు పైకి ఉబికిరాకపోవండతో నిలువునా ఎండిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 సుమారు 700 అడుగుల్లో బోర్లు వేసినా జలం ఉబికి రావడం లేదని తెలిపారు. నష్టపోయిన రైతులకు తగిన పరిహారం అందించాలని రైతులు కోరారు. రాచకొండ గ్రామ ఉపాధి కూలీలు మాట్లాడుతూ పని చేసినా కూలి సరిగా గిట్టుబాటు కావడం లేద ని, ఉపాధి పనులు తమ కడుపు నింపడం లేదని వాపోయారు. ఎండలు ఎక్కువగా ఉన్నం దున పనులు చేయలేకపోతున్నామని వివరించా రు. దీనిపై అమితాబ్‌ గౌతం స్పందించి గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న పనిగంటలు తగ్గించే విధంగా నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామని హామీ ఇచ్చారు.

మిరప, కంది పంటలు వేసి నష్టపోయాం..
చాపలమడుగు, చెన్నంపల్లి గ్రామంలోని రైతులు మిరప, పత్తి, కంది పంటలు వేసి తీవ్రంగా నష్టపోయామని రామిరెడ్డి, యోగిరెడ్డి, పాపిరెడ్డిలు కరువు బృందం ఎదుట వాపోయారు. తమ గ్రామాల్లో భూగర్భ జలాలు అడుగంటి పోయాయని, గతేడాది కురిసిన చిన్న పాటి వర్షాలకు నార్లు తీసుకొచ్చి పంటలను సాగు చేస్తే తీరా అవి కాపుకు వచ్చే సమయానికి ఎండిపోతున్నాయని, లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు వేస్తే చుక్కనీరు రాక పోగా పంటలు ఎండిపోయి అప్పుల పాలయ్యామని రైతులు ఆవేదన వ్యక్తం చేశా రు. నష్ట పరిహారం కోసం అంచనాలు వేసినా పరిహారం జాడలేదన్నారు.

అనంతరం కరువు బృంద సభ్యులను యర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్‌రాజు కలిసి మండలంలోని పరిస్థితులు వివరించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. కరువు బృందం క్షేత్ర స్థాయిలో పొలాలను పరిశీలించకుండానే కేవలం రైతులతో ముఖాముఖితో పర్యటన ముగించింది. కేంద్ర బృందం వెంట డ్వామా పీడీ పోలప్ప, ఏపీఎంఐపీ పీడీ విద్యాశంకర్, హర్టీకల్చర్‌ పీడీ హరిప్రసాద్, వ్యవసాయ శాఖ జేడీఏ మురళీకృష్ణ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ నాగుర్జునరెడ్డి, నీటిపారుదల శాఖ అధికారి శారద, మార్కాపురం ఆర్‌డీవో కొండయ్యతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వానికి వాస్తవ పరిస్థితులు వివరిస్తాం :
క్షేత్రస్థాయిలో కరువు పరిస్థితులు గమనించాం. ప్రజల అభిప్రాయాలు తెలు సుకున్నాం. సుద్దకురవతండా, రాచకొండ, పుల్లలచెరువు, చాపలమడుగు గ్రా మాల ప్రజలతో స్వయంగా మాట్లాడాం. వర్షాలు లేక పోవడం, శాశ్వత తా గునీటి పథకాలు లేకపోవడంతో ప్రజ లు తీవ్ర కరువులో చిక్కుకున్నారని గు ర్తించాం. మండల పరిస్థితులపై కేంద్ర ప్రభుత్వాని వాస్తవ నివేదకను అందించి రైతులకు పరిహారం అందేలా కృషి చేస్తాం. అమితాబ్‌ గౌతం, కరువు బృందం సభ్యుడు

Advertisement
Advertisement