డీఎస్సీ అభ్యర్థులకు ని‘బంధనాలు’ | Sakshi
Sakshi News home page

డీఎస్సీ అభ్యర్థులకు ని‘బంధనాలు’

Published Sun, Dec 28 2014 12:31 AM

DSC candidates Conditions

విజయనగరం అర్బన్ : జిల్లాలోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్వహించనున్న టీచర్ ఎలిజిబులిటీ కమ్ రిక్రూట్‌మెంట్ టెస్ట్ (టీఆర్ టీ)లో గందరగోళం నెలకొంది. ఆరు మాసాల పాటు ఊరించి ఎట్టకేలకు జారీ చేసిన నోటిఫికేషన్‌లో అడ్డగోలు నిబంధనలు చూసి అభ్యర్థులు కుంగి పోతున్నారు. టెట్, డీఎస్సీ-2014 రెండు పరీక్షలూ కలిపి రాయడం, పరీక్షలకు సిలబస్, వివిధ కేడర్ పోస్టుల అర్హతలు, స్థానికత, దూరవిద్య వంటి పలు అంశాలపై అడ్డగోలు నిబంధనలు పెడ్డడంతో అభ్యర్థులు అడుగడుగునా ఇబ్బందులు పడుతున్నారు.
 
 పోటీకి అవకాశం ఇవ్వని స్థానికత సమస్య    
 రాష్ట్ర విభజన నేపథ్యంలో పలువురు అభ్యర్థులు స్థానిక సమస్యను ఎదుర్కొంటున్నారు. విద్యాశాఖలో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి అభ్యర్థుల విద్యాభ్యాసన జరిగిన ప్రాంతాన్నే వారికి స్థానికంగా గుర్తిస్తారు. 10వ తరగతి వరకు ఏడేళ్లపాటు ఏ జిల్లాలో విద్యాభ్యాసం చేస్తే ఆ జిల్లానే స్థానిక జిల్లాగా గుర్తిస్తారు. అయితే రాష్ట్ర విభజన తరువాత వచ్చిన డీఎస్సీలో తెలంగాణా జిల్లాల్లో విద్యాభ్యాసం చేసిన వారికి  ఇక్కడ అవకాశం ఇవ్వలేదు. ఈ నిబంధన వల్ల పలు వర్గాల నిరుద్యోగులకు తీరని అన్యాయం జరుగుతోంది. ఉమ్మడి రాష్ట్రంలో క్రీడాపాఠశాల తెలంగాణ ప్రాంతంలో   ఉండడం  వల్ల అక్కడ చదివిన విద్యార్థులందరికీ ప్రస్తు త డీఎస్సీలో అవకాశం కల్పించలేదు. వీరితో పాటు ఉపాధి కోసం పొట్టచేత పట్టుకుని హైదరాబాద్, తెలం గాణా జిల్లాలకు వలసవెళ్లి వారి పిల్లలున్నారు. వారి పరిస్థితీ ఇదే.
 
 మరిన్ని నిబంధనలు
 డీఎస్సీ-2014కు ప్రభుత్వం విధించిన నిబంధనలు ని రుద్యోగుల పాలిట ప్రతిబంధకాలుగా మారుతున్నాయి. వందలాది మంది విద్యార్థులు డీఎస్సీకి అర్హత కో ల్పోయే ప్రమాదం ఏర్పడింది. గతంలో అభ్యర్థు లు డీఎస్సీ రాతపరీక్షకు హాజరై, వారు టీచర్ పో స్టుకు ఎంపికైన తర్వాతే సర్టిఫికెట్ల పరిశీలన చేసేవారు. ప్రస్తుతం నోటిఫికేషన్‌లో అలా లేదు. డీఎ స్సీకి దరఖాస్తు చేసే సమయంలో ఆన్‌లైన్‌లో ఏ యే విద్యార్హతలున్నట్టు అభ్యర్థులు పేర్కొన్నారో .... ఆ సర్టిఫికెట్ల జెరాక్స్ కాపీలు, ఆన్‌లైన్ దరఖాస్తు ప్రింటవుట్ జతచేసి డీఎస్సీ కౌంటర్లలో సమర్పించాలి. ఇదే సమయంలో ఒరిజినల్ సర్టిఫికెట్లను కూడా పరిశీలిస్తున్నారు. విద్యార్హతకు సంబంధించి ఒరిజినల్ సర్టిఫికెట్లు ఇంకా చేతికి అందని అభ్యర్థులు ఈ డీఎస్సీలో అవకాశం కో ల్పోయే ప్రమాదం ఉంది. డీఈడీ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇప్ప టివరకు ఆ ఫలితాలు ప్రకటించలేదు. దీంతో వీరు డీఎస్సీ-2014కు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కోల్పోనున్నారు. గతంలో మాత్రం డీఈడీ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన అభ్యర్థుల ను  కూడా డీఎస్సీకి అనుమతించారు.
 
 బీకాం అభ్యర్థులకు నిరాశే
 స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు బీకాం అభ్యర్థులకు అర్హులుగా ప్రకటించిన ప్రభుత్వం... సబ్జెక్టుల విషయంలో నిబంధనలు పెట్టి వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన 38 జీఓ ప్రకారం కనీసం నాలుగు సబ్జెక్టులున్న వారు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు అర్హులు. అయితే ఇక్కడ యూనివర్సిటీ జారీ చేస్తున్న బీకాం డిగ్రీలో మూడు సబ్జెక్టులు మాత్రమే ఉంటున్నా యి. వీటిలో ఒక సబ్జెక్టుగా కంప్యూటర్ ఫండమెంటల్స్ కూడా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం బీకాం అభ్యర్థులకు నాలుగు సబ్జెక్టులు లేకపోవడంతో వీరి దరఖాస్తులు స్వీకరించడం లేదు.
 
 వికలాంగులకూ తప్పని పాట్లు
 ఓహెచ్, వీహెచ్, హెచ్‌హెచ్ అభ్యర్థుల విషయంలో సర్టిఫికెట్లు ఎవరు జారీ చేయాలన్న విషయంలో కూడా స్పష్టత లేదు. అదే విధంగా స్కూల్ అసిస్టెంట్ గణితం పోస్టు అర్హత విషయంలో కూడా స్పష్టత కొరవడింది. గతంలో ప్రభుత్వం శాశ్వత కులధ్రువీకరణ పత్రాలను జారీ చేయగా... తాజాగా మీ-సేవ ద్వారా తీసుకున్న కు లధ్రువీకరణ పత్రాలు సమర్పించాలని చెబుతున్నారు. ఈ విషయంలో కూడా స్పష్టత లేకపోవడంతో అభ్యర్థులు గందరగోళానికి గురవుతున్నారు.
 
 దూరవిద్య అభ్యర్థుల ఇక్కట్లు
 దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసి,  డీఎస్సీకి హజరవుతున్న అభ్యర్థులకు కూడా ఇక్కట్లు తప్పలేదు. డీఎస్సీ నోటిఫికేషన్‌లో స్కూల్ అసిస్టెంట్ పోస్టుకు తప్పనిసరిగా 10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీతోపాటు బీఈ డీ పూర్తి చేసిన అభ్యర్థులు  మాత్రమే అర్హులని స్పష్టంగా పేర్కొంది. దూరవిద్య ద్వారా డిగ్రీ చేసిన కొందరు అభ్యర్థులు 10వ తరగతి తర్వాత నేరుగా డిగ్రీకి హాజరయ్యారు. దీంతో వీరికి ఇంటర్మీడియెట్ సర్టిఫికెట్ లేదు. ఈ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించేం దుకు అవాంతరాలు ఎరురవుతున్నాయి. ఇంటర్మీడియె ట్ లేని కారణంగా వీరి దరఖాస్తులు అప్‌లోడ్ కావడంలేదు. దూర విద్యను ప్రోత్సహిస్తున్నామని బాకా ఊదుతున్న  ప్రభుత్వం, ఉద్యోగాల విషయంలో అడ్డగోలు ని బంధనలు పెట్టడం ఏమిటని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నా రు. గత డీఎస్సీల్లో ఎన్నడూ ఈ నిబంధన లేదు. ఇం టర్మీడియెట్ లేకపోయినా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులుగా గుర్తించాలని అభ్యర్థులు కోరుతున్నారు.
 
 డీఎస్సీ నిర్వహణపై స్పష్టత ఇవ్వాలి
 అధికారులు రోజకోరకంగా స్పష్టతలేని ప్రకటనలు చేస్తున్నారు. అసలు అనుకున్న సమయానికి డీఎస్సీ జరుగుతుందో లేదో అన్న సందేశం కలుగుతోంది. ఈ పరీక్షపై నిర్థిష్టమైన, స్పష్టమైన విధానాన్ని అభ్యర్థులకు వివరించాలి.
 -ఐ. సింహాచలం,
 డీఎడ్ అభ్యర్థి, జిన్నాం, గజపతినగరం.
 
 చదివే సమయం ఏదీ?
 అన్‌లైన్ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రపంచ మంతా ఈజీ ప్రొసెస్‌లో ఉంటే.. డీఎస్సీలో మాత్రం అన్ని సర్టిఫికెట్లను సబ్‌మిట్ చేయాలని చెప్పి ఇబ్బంది పెడుతున్నా రు. ధ్రువీకరణ పత్రాల కోసం తహశీల్దార్ కార్యాల యం చుట్టూ, కాలేజీల చుట్టూ తిరగడానికే సరిపోతుం ది. చదువుకోవడానికి సమయం ఎక్కడుంది..?
 -కె.కిరణకుమారి, బీఎడ్ అభ్యర్థి , విజయనగరం.
 
 నా పేరు తాటి తూరి సరోజా గాయత్రి. తెలంగాణాలోని రంగారెడ్డి జిల్లా అక్కింపేట స్పోర్ట్స్ స్కూల్‌లో 4వ తరగతి నుంచి సీనియర్ ఇంటర్ వరకు చదివాను. పీఈటీ పోస్టుకు విద్యార్హత ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని స్టడీ సర్టిఫికెట్‌కు ప్రస్తుత డీఎస్సీకి అర్హత లేదని ఆన్‌లైన్‌లో దరఖాస్తును తీసుకోవడం లేదు. తండ్రి స్థానికేతరుడు కావడం వల్ల తెలంగాణ డీఎస్సీకి కూడా అర్హత లేదు. దీన్ని విద్యాశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. నూతన నిబంధనలు ఆ విధంగా ఉన్నాయి.. మా చే  తుల్లోలేదని చెబుతున్నారు.
 - ఇది ఈమె ఒక్కరి సమస్యే కాదు. స్థానికత సమస్యతో జిల్లాలో పలువురు ఆందోళన చెందుతున్నారు.
 

Advertisement
Advertisement