జూన్ 4న డీఎస్సీ ఫలితాలు | Sakshi
Sakshi News home page

జూన్ 4న డీఎస్సీ ఫలితాలు

Published Mon, May 25 2015 9:44 PM

dsc results on june fourth

పాధమిక కీపై అభ్యంతరాలనేకం
పరిశీలిస్తున్న ఎస్‌సీఈఆర్టీ
హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డీఎస్సీ-2014 రాతపరీక్షల ఫలితాలను జూన్ 4వ తేదీన విడుదల చేయనున్నారు. షెడ్యూల్ ప్రకారం జూన్ 1వ తేదీనే ఈ ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. ఆమేరకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు కూడా ఇదివరకే చేపట్టింది. అయితే డీఎస్సీ నిర్వహణకు సంబంధించి కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు ఆ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇస్తూ జూన్ 3వ తేదీకి వాయిదా వేసింది. ఫలితాల విడుదలపై కోర్టు ఎలాంటి ఆదేశాలూ ఇవ్వనందున ఆ ఉత్తర్వులకు ఫలితాలకు సంబంధం లేదు.

కానీ రెండు రోజుల్లో కోర్టు తన అభిప్రాయాన్ని వెల్లడించనున్న తరుణంలో ఫలితాలను విడుదల చేయడం సరికాదన్న అభిప్రాయంతో పాఠశాల విద్యాశాఖ ఉంది. రెండు రోజులు ఆగి కోర్టు వాయిదా తేదీ అనంతరం 4వ తేదీన ఫలితాలు విడుదల చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. షెడ్యూల్ తేదీకి బదులు 4వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఇలా ఉండగా డీఎస్సీ ప్రాధమిక కీని ఇటీవల పాఠశాల విద్యాశాఖ విడుదల చేయడం తెలిసిందే. ఈ కీ పై అభ్యంతరాల వెల్లడికి వారం రోజుల పాటు గడువు ఇచ్చింది. ఈ కీపై అభ్యంతరాలనేకం వచ్చినట్లు విద్యాశాఖాధికారులు పేర్కొంటున్నారు. వీటిని రాష్ట్ర విద్యా, శిక్షణ, పరిశోధనా మండలి పరిశీలిస్తోంది. అనంతరం తుది కీని విడుదల చేయనున్నారు.

Advertisement
Advertisement