ద్వారకా తిరుమలకు పెళ్లికళ

3 Mar, 2015 23:30 IST|Sakshi

ద్వారకాతిరుమల: పశ్చిమగోదావరి జిల్లాలో సుప్రసిద్ధ క్షేత్రం ద్వారకా తిరుమలలో వివాహ సందడి నెలకొంది. 4, 5వ తేదీల్లో మంచి ముహూర్తాలు ఉండటంతో వందల సంఖ్యలో పెళ్లిళ్లు జరగనున్నాయి. దీన్ని పురస్కరించుకుని ఇప్పటికే వెంకటేశ్వరస్వామి దేవస్థానం, ప్రైవేటు కల్యాణ మండపాల్లో అన్ని గదులు ముందుగానే బుక్ అయిపోయాయి. పెళ్లి వేదికల ఏర్పాట్లలో పలువురు నిమగ్నమై ఉన్నారు. పూలు, పురోహితులు, ఇతర పెళ్లి సామగ్రికి మంచి గిరాకీ ఏర్పడింది.

 

పుష్కరాలు సమీపిస్తున్న తరుణంలో ఈ మాసంలో ఇవే బలమైన ముహూర్తాలు కావడంతో అధికంగా వివాహాలు జరగనున్నాయని పురోహితుడు వెంకట రమణమూర్తి శర్మ చెబుతున్నారు.

మరిన్ని వార్తలు