భూప్రకంప అలజడి... | Sakshi
Sakshi News home page

భూప్రకంప అలజడి...

Published Wed, May 13 2015 12:50 AM

earthquake in srikakulam

 శ్రీకాకుళం సిటీ: సిక్కోలులో మరోసారి స్పల్పంగా భూప్రకంనలు చోటుచేసుకోవడంతో పలువురు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం నేపాల్‌లో మరో దఫా భూకంప ప్రభావం సిక్కోలు వాసులను కంటిమీద కునుకు లేకుండా చేిస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే రెండోసారి ఈ తరహా  సంఘటనలతో భయం గుపెట్లో ఉండాల్సిన పరిస్తితి ఏర్పడిందంటూ స్థానికులు వాపోతున్నారు. పట్టణంలో పలు అపార్టుమెంట్‌లో నివసించే వారు ఇంటినుంచి బయటకు పరుగులు తీశారు.  ఈ సంఘటన దావాలంలా వ్యాపించడంతో కొద్ది సేపు సిక్కోలు ప్రజల్లో కొద్దిపాటి భయాందోళనలు కనిపించాయి. ఎట్టకేలకు కొద్ది సేపటికి పరిస్థితి సద్దుమణగడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు.
 
 కె.మత్స్యలేశం స్వల్పంగా..
 గార:   మండలంలోని కె. మత్స్యలేశం పంచాయతీలో మంగళవారం మధ్యాహ్నం స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. 12.50 గంటలకు భూప్రకంపన రావడంతో ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీసారు. సముద్ర తీర ప్రాంతం ఇళ్లల్లో ఉన్నవారికి ఈ తీవ్రత ఎక్కువగా ఉందని పలువురు తెలిపారు.
 
 నేటి నుంచి శుభప్రదం శిక్షణ
 ఎచ్చెర్ల: తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సింహాద్రినాథ సేవా సమితి నిర్వహించనున్న శుభప్రదం శిక్షణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బుధవారం నుంచి ఈనెల 19 వరకు శిక్షణ ఇస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం నోడల్ అధికారులు, సింహాద్రినాథ సేవా సమితి ప్రతినిధులు ఎచ్చెర్ల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం వంశధార, నాగావళి వసతి గృహాల్లో బాలురకు, వెంకటేశ్వర ఇంజినీరింగ్ కళాశాల వసతి గృహంలో మహిళలకు వసతి ఏర్పాటు చేశారు.   ఏర్పాట్లను నిర్వహణ ప్రతినిధులు బారాటం కామేశ్వరావు, సీకే నాయుడు తదితరులు పర్యవేక్షించారు.
 
 మరో మూడు టాటా ఇండికాస్ ఏటీఎంలు
 పొందూరు: టాటా కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో పొందూరు, పలాస, టెక్కలి ఆర్టీసీ బస్టాండ్‌లలో టాటా ఇండికాస్ ఏటీఎంలు త్వరలో ప్రారంభించనున్నారు. శ్రీకాకుళం, విజయనగరం టాటా ఏటీఎంల అధికారి ఎన్.ప్రసన్న కుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం పొందూరు ఆర్టీసి కాంప్లెక్స్‌లో ఏటీఎం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొందూరులో ఏర్పాటు చేసిన ఏటీఎం మరో రెండు, మూడు రోజుల్లో పనిచేస్తుందన్నారు.
 

Advertisement
Advertisement