ఏపీ ఎన్‌జీవో హోమ్‌లో ఉద్రిక్తత.. 

17 Jun, 2018 18:05 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలోని ఆంధ్రప్రదేశ్‌ ఎన్‌జీవో హోమ్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఏపీ ఎన్‌జీవో హౌసింగ్‌ బోర్డు ఆదివారం సమావేశమైంది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై చర్చ జరిగింది. తెలంగాణ ఎన్‌జీవోలు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని, సమావేశాన్ని అడ్డుకున్నారు.

అంతలోనే ఏమైందో సమావేశంలో ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. జనరల్‌ సెక్రటరీ చంద్రశేఖర్‌ రెడ్డిపై కొంతమంది దాడికి దిగారు. విషయం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేశారు. అంతేకాక పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని వార్తలు